Friday, November 22, 2024

వేస‌విలోనూ నిరంత‌ర విద్యుత్ – జ‌గ‌న్ ఆదేశం..

అమరావతి, రాష్ట్రంలో ఎండలు మండిపో తున్నాయి.. వేసవిలో అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. మార్చి రెండో వారంలోనే విద్యుత్‌ వాడకం మరింతగా పెరిగింది. దీనికితోడు రాష్ట్ర ప్రభుత్వం పగటిపూటే రైతులకు ఉచిత విద్యుత్‌ ఇస్తున్న నేపథ్యంలో వ్యవసాయ విద్యుత్‌ వాడకం కూడా పెరిగింది. సాగు విస్తీర్ణం పెరగడంతో వ్యవసాయ విద్యుత్‌ డిమాండ్‌ కూడా పెరిగింది. ఇక కరోనా కష్టాల నుండి ఇప్పుడిప్పుడే గట్టెక్కుతున్న పారిశ్రామిక రంగం కూడా ఊపందుకుంది. దీంతో రాష్ట్రంలో విద్యుత్‌ వాడకం మరింతగా పెరింది. ఈ క్రమంలో వేసవిలో విద్యుత్‌ సరఫరాలో అంతరాయాలు లేకుండా చూడాలని, నిరంతరం నాణ్యమైన విద్యుత్‌ను సరఫరా చేయాలన్న రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు విద్యుత్‌ సంస్థలు సర్వసన్నద్ధమవుతున్నాయి. మారుమూల గ్రామా ల్లో సైతం కరెంటు- సరఫరాలో అంతరాయాలు లేకుండా చూసేందుకు అవసరమైన కార్యాచరణ ప్రణాళికను సిద్ధం చేసుకున్నాయి.
రాష్ట్రంలో ఇప్పటికే ఎండలు మండిపోతున్నాయి. ఈనెల 9న విద్యుత్‌ వినియోగం 213 మిలియన్‌ యూనిట్లతో సరికొత్త గరిష్ఠ స్థాయికి చేరింది. అయినా విద్యుత్‌ సంస్థలు విజయవంతంగా సరఫరా చేశాయి. వాస్తవానికి 2017తో పోల్చితే రాష్ట్రంలో విద్యుత్‌ డిమాండ్‌ గణనీయంగా పెరిగింది. 2017 మార్చి 9న విద్యుత్‌ డిమాండ్‌ 161 మిలి యన్‌ యూనిట్లు- ఉంది. 2021 మార్చి 9న ఇది 213 మిలి యన్‌ యూనిట్లకు చేరింది. రాష్ట్రంలో ఆర్థిక కార్యకలాపాలు పెరగడం వల్లే విద్యుత్‌ డిమాండ్‌ కూడా పెరుగుతోందని రాష్ట్ర ఇంధన శాఖ కార్యదర్శి శ్రీకాంత్‌ నాగులాపల్లి అన్నారు.
అత్యధిక గ్రిడ్‌ డిమాండ్‌ అంచనా వేస్తున్న నేపథ్యంలో వేసవిలో అంతరాయాల్లేని విద్యుత్‌ సరఫరాకు అవసరమైన అన్ని చర్యలు చేపట్టాలని సీఎం వైఎస్‌ జగన్మోహన్‌ రెడ్డి విద్యుత్తు సంస్థలను ఆదేశించారు. సీఎం ఆదేశాల మేరకు అధికారులు కార్యాచరణ సిద్ధం చేసారు. రాష్ట్రంలో ఎంత డిమాండ్‌ వచ్చినా తట్టు-కునేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉంది. అంతరాయాల్లేని విద్యుత్‌ సరఫరాలో ప్రభుత్వ ఆకాంక్షలకు అనుగుణంగా పనిచేసేందుకు విద్యుత్తు సంస్థలు పూర్తి సన్నద్ధంగా ఉన్నాయని శ్రీకాంత్‌ తెలిపారు.
గ్రామాలు, వ్యవసాయంపై ప్రత్యేక దృష్టి..
నగరాలు, పట్టణాలే కాకుండా మారుమూల గ్రామాలు, శివారు ప్రాంతాలకు కూడా అంతరాయా ల్లేకుండా విద్యుత్‌ సరఫరా చేయడంపై ప్రభుత్వం ప్రత్యే కంగా దృష్టి సారించిందని శ్రీకాంత్‌ తెలిపారు. గ్రామాల్లో కూడా నిరంతరాయంగా నాణ్యమైన విద్యుత్‌ను సరఫరా చే యాలని ప్రభుత్వం విద్యుత్తు సంస్థలను ఆదేశించిందన్నారు.
నెట్‌వర్క్‌ బలోపేతంపైనా..
ఏపీ ట్రాన్స్‌కో నెట్‌వర్క్‌ బలోపేతంపైనా దృష్టి సారించింది. వేమగిరిలో 500 మెగావాట్ల పీటీ-ఆర్‌ను జత చేయడం ద్వారా ట్రాన్స్‌ ఫార్మర్ల సామర్థ్యాన్ని 400 కేవీకి పెంచుతోంది. ఇది మరో 20 రోజుల్లో అందుబాటు-లోకి రానుంది. అలాగే దిగువ సీలేరు- బొమ్మూరు 220 కేవీ పాత లైన్‌ను కూడా అందుబాటు-లోకి తీసుకొస్తోంది. ఈహెచ్టీ లైన్ల పై ఓవర్‌ లోడును తగ్గించేందుకు చర్యలు తీసుకుంటోంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement