Friday, November 22, 2024

మూడు త‌ప్పుల‌తో చంద్ర‌బాబుకు అసైన్డ్ ఉచ్చు….

నష్టపరిహార జాబితాలో బినామీలు… వారికే వాణిజ్య, నివాస స్థలాలు
సీఆర్‌డీఏ పెంపు పరిధిలో మతలబు
చంద్రబాబుకు నోటీసులతో టీడీపీలో కలకలం

అమరావతి, : అమరావతి రాజధాని భూముల వ్యవహారంలో నిజంగా తప్పు జరిగిందా.. గత పాలకులు అధికారాన్ని అడ్డం పెట్టుకుని అక్రమాలకు పాల్పడ్డారా? ఇన్‌సైడ్‌ ట్రేడింగ్‌ అసలు జరిగిందా? రాష్ట్ర ప్రభుత్వం నియమించిన మంత్రివర్గ ఉపసంఘం ఆ దిశగానే నిర్ధారణకు వచ్చిందా? తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలో ఉన్న సమయంలో అమరావతి రాజధాని భూముల్లో అసలేం జరిగింది? ప్రధానంగా గత ప్రభుత్వం మూడు అంశాల్లో తప్పు చేసినట్లు సీఐడీ నిర్ధారణకు వచ్చినట్టు చెబుతున్నారు. ఆ దిశగానే ప్రస్తుత రాష్ట్ర ప్రభుత్వం గత అక్రమాలపై కొరడా ఝుళిపించాలని నిర్ణయం తీసుకుంది. ఆ ప్రక్రియలో భాగంగానే తెలుగుదేశం పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడుకి, మాజీ మంత్రి నారాయణకి సీఐడీ నోటీసులు జారీ చేసింది. నిబంధనలకు పూర్తి విరుద్దంగా అసైన్‌మెంట్‌ భూములను కొనుగోలు చేయడంతో పాటు నష్ట పరిహార జాబితాలో కూడా వారి పేర్లను నమోదు చేసినట్లు గుర్తించారు. అసైన్‌మెంట్‌ భూములతో పాటు సుమారు 4070 ఎకరాలకు పైగా భూ కుంభకోణం జరిగినట్లు నిర్ధార ణకు వచ్చారు. ఆ దిశగానే ఈ వ్యవహారంలో ప్రధాన పాత్రధారులు, సూత్ర ధారులను విచారించి చర్యలు తీసుకునేందుకు ప్రభుత్వం సిద్దమవుతోంది. అమరావతి భూ కుం భకోణం వ్యవహారంపై గతంలో మంత్రివర్గ ఉపసం ఘం ఇచ్చిన నివేదిక ఆధారంగా మంగళవారం చంద్రబాబుకు నోటీసులు కూడా అందజేశారు. అదేవిధంగా ఇన్‌సైడర్‌ ట్రేడింగ్‌కు పాల్ప డ్డ వారి జాబి తాను కూడా వెల్లడించింది. విజయవాడ, గుంటూరు మధ్యలో అమరావతికి సమీపంలో రాజధాని ప్రకటిస్తారని ముందస్తు సమాచారంతోనే పెద్ద ఎత్తున రాజధాని ప్రాంతంలో భూములను కొను గోలు చేసినట్లు మంత్రివర్గం తేల్చి చెప్పింది. 2014 డిసెం బరు 31వ తేది అమరావతి రాజధాని కోసం సీఆర్‌డీ ఏను ఏర్పాటు చేశారు. ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన ఈ వ్యవస్థ కు ఛైర్మన్‌గా నాటి ముఖ్యమంత్రి నారా చంద్రబా బునాయుడు, కన్వీనర్‌గా అప్పటి మున్సిపల్‌ శాఖ మంత్రి పొంగూరు నారాయణలు వ్యవహ రించారు. అలాగే సీఆర్‌డీఏ కమిషనర్‌గా ప్రస్తుతం ట్రాన్స్‌కో సీఎండీగా ఉన్న నాగులపల్లి శ్రీకాంత్‌ అప్పట్లో కీలకంగా వ్యవహరించారు. నూతన రాజధాని నిర్మాణం కోసం 33,500 ఎకరాలను 21,500 మంది రైతుల నుంచి సేకరించారు. అలాగే 10 వేల ఎకరాల అటవీ భూములు, మరో 10 వేల ఎకరాల దేవాదాయ భూములు కలిపి రాజధాని నిర్మాణం కోసం 50 వేల ఎకరాలను సమీకరించారు.
తప్పెక్కడ జరిగిందంటే..
అమరావతి రాజధాని నిర్మాణం కోసం 50 వేల ఎకరాలకు పైగా సేకరించిన నాటి ప్రభుత్వం 6 వేల ఎకరాలను వివిధ సంస్థ లకు విక్రయించింది. అలాగే ఈ వ్యవహారంలోనూ కొన్ని పొరపాట్లు చోటుచేసు కున్నాయి. అదేవిధంగా పై భూముల సమీపంలో సుమారు 2 వేల ఎకరాల అసైన్‌మెంట్‌ భూములను కూడా కొనుగోలు చేశారు. వాటిలో కొన్ని భూములు రాజధాని ప్రకటన చేయకముందు కొనుగోలు చేయగా.. సుమారు 900 ఎకరాల భూములు ఆయా లబ్దిదారుల నుంచి కొంతమంది అప్పటి అధికార పార్టీకి చెందిన బినామీలు బలవంతంగా కొనుగోలు చేశారు. నిబంధనల ప్రకారం అసైన్‌మెంట్‌ భూములు కొనుగోలు చేయకూడదు. ఇక్కడే అప్పటి పాలకులు పెద్ద తప్పు చేశారు. దానిని సరిదిద్దుకోకపోగా.. అసైన్‌మెంట్‌ భూములు కొనుగోలు చేసిన వారిని నష్ట పరిహార జాబితాలో కూడా చేర్చి మరో పెద్ద తప్పు చేశారు. ఏకంగా వారిని ఆ జాబితాలో చేర్చడంతో పాటు వాణిజ్య, నివాస స్థ లాలను కూడా వారిలో కొంత మందికి కట్టబెట్టారు. మరికొంతమందికైతే ఏడాదికి 30 నుంచి 50 వేల రూపాయల కౌలు కూడా చెల్లిం చారు. అయితే అప్పటికే సీఆర్‌డీఏలో కొన్ని తప్పులు దొర్లడం, వాటిని సరిచేసే క్రమంలో నాటి సీఆర్‌డీఏ కమిషనర్‌ నాగులపల్లి శ్రీకాంత్‌కు, అప్పటి రాష్ట్ర ప్రభుత్వ పెద్దలకు వివాదం కూడా సాగింది. దీంతో కమిషనర్‌ తమకు వ్యతిరేకంగా ఉన్నారని ఆయనను ఆగమేఘాల మీద అప్పట్లో బదిలీ చేసి వారికి అనుకూలంగా ఉన్న మరో సీనియర్‌ ఐఏఎస్‌ అధికారి లక్ష్మీప్రసన్నను కమిషనర్‌గా నియమించారు.
సీఆర్‌డీఏ పరిధి పెంచి తప్పు చేశారు
రాజధాని అభివృద్ది కోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన సీఆర్‌డీఏ పరిధిని పెంచి నాటి పాలకులు తమకు అనుకూలంగా ఉన్నవారికి లబ్ది చేకూర్చారు. ఇదే విషయం విచారణలో కూడా వెలుగుచూసింది. 2014 డిసెంబరు 31వ తేది ఏర్పాటైన సీఆర్‌డీఏను మధ్యలో పరిధిని పెంచారు. కంచెకచర్ల, జగ్గయ్యపేట, సత్తెనపల్లి తదితర ప్రాంతాల సమీపం వరకు పెంచారు. అందు లో ముఖ్యంగా జగ్గయ్యపేటకు సమీపంలో హిందూ పురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ కు దగ్గర బంధు వులకు సుమారు 490 ఎకరాల భూములను కూడా ఇచ్చారు. కేవలం వారికి లబ్ది చేకూర్చడానికే సీఆర్‌డీఏ పరిధిని పెంచారన్న విమర్శలు కూడా అప్పట్లో విని పించాయి. మంత్రివర్గ విచారణలోనూ అది నిజమే నని తేలింది. అలాగే సత్తెనపల్లికి సమీపంలో కూడా టీడీపీ అగ్ర నాయకులకు సంబంధించి కొంత మందికి భూములు ఉన్నట్లు గుర్తించారు.
మంత్రివర్గ ఉపసంఘం సమగ్ర నివేదిక
తెలుగుదేశం పార్టీ నేతలు, వారికి సంబంధించిన బినామీలకు మరింత మేలు చేకూర్చేలా గతంలో చంద్ర బాబు ప్రభుత్వం రాజధాని సరిహద్దులపై నిర్ణయం తీసుకుందని, ఫలితంగానే అమరావతి రాజధాని ప్రాంతంలో పెద్ద ఎత్తున భూఅక్రమాలు జరిగాయని, మంత్రివర్గ ఉపసంఘం రాష్ట్ర ప్రభుత్వానికి సమ ర్పించిన నివేదికలో స్పష్టం చేసింది. లంకపోరంబోకు, ప్రభుత్వ భూముల రికార్డుల్లో భారీ అక్రమాల జరిగినట్లు కూడా గుర్తించింది. ల్యాండ్‌ పూలింగ్‌ స్కీమ్‌ కూడా రికార్డులను తారుమారు చేసినట్లు నిర్ధారించింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement