గుంటూరు కల్చరల్, – శ్రీఅష్టలక్ష్మి సమేత స్వామి దేవస్థానం వార్షిక బ్రహ్మోత్సవాలలో శ్రీధైర్యలక్ష్మి అమ్మవారి కళ్యాణం అత్యంత భక్తి శ్రద్ధలతో జరిగింది. స్థానిక అరండల్ పేటలోని శ్రీఅష్టలక్ష్మి సమేత శ్రీలక్ష్మీనారాయణ దేవస్థానంలో సోమవారం ఉదయం ఆలయ ప్రధాన పూజారి మర్రిపాటి ప్రసాద్ బృందం ఆధ్వర్యంలో శ్రీచక్రాభిషేకం, విశేష పూజలతోపాటు ఆంధ్ర రాష్ట్రంలో కరోనా అంతమైపోవాలని, ప్రజలందరూ సుభిక్షంగా ఉండాలని , లోక కళ్యాణం జరగాలని అమ్మవారికి పూజలు నిర్వహించారు. కార్యక్రమాలలో శ్రీధైర్యలక్ష్మి అమ్మవారి కళ్యాణం వేద మంత్రాల నడుమ భక్తిశ్రద్ధలతోనిర్వహించారు. కల్యాణంలో పాల్గొన్న దంపతులు, భక్తులు, మంత్రపుష్పం , విశేష హారతి అనంతం తీర్ధ ప్రసాదాలను స్వీకరించారు. సాయంత్రం 6.00గంటలకు సువాసినులచే సామూహిక పారాయణాలు విశేషంగా జరిగాయి. ఈ సందర్బంగా ఆలయ ప్రధాన అర్చకుడు మర్రిపాటి ప్రసాద్ మాట్లాడుతూ కళ్యాణాలలో భాగంగా బుధవారం శ్రీగజలక్ష్మి అమ్మవారి కళ్యాణం విశేషంగా జరుగుతుందని, భక్తులు విశేషంగా అమ్మవారి సేవలో పాల్గొనాలని , కార్యక్రమాలలో పాల్గొనే భక్తులు మాస్కులు ధరించి కోవిడ్ నిబంధనలను తప్పక పాటించాలని కోరారు.
Advertisement
తాజా వార్తలు
Advertisement