Saturday, November 23, 2024

ప్రతిష్టాత్మ‌కంగా జ‌గ‌న‌న్న విద్యా కానుక‌..

ఆంధ్ర‌ప్ర‌భ దిన‌ప‌త్రిక‌లో ప్ర‌త్యేక క‌థ‌నం..
కిట్‌లో కొత్తగా ఇంగ్లీష్‌- తెలుగు డిక్షనరీ
విడతల వారీగా ఇంగ్లీష్‌ మీడియం నేపథ్యంలో నిర్ణయం
43 లక్షల మంది విద్యార్థులకు అందించేలా ప్రణాళిక
రూ.731.30 కోట్లతో పథకం సమర్థంగా అమలయ్యేలా చర్యలు
అమరావతి, : ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు అందించే ‘జగనన్న విద్యాకా నుక’లో ఈసారి అదనంగా ఇంగ్లీష్‌- తెలుగు డిక్షనరీని అందజేయనున్నారు. ప్రభుత్వం విడతల వారీగా ఆంగ్ల మాధ్యమాన్ని అమలు చేయాలని నిర్ణయించడంతో ఆ మేరకు ప్రత్యేకంగా నిఘంటు వును, ఇంగ్లీష్‌ ల్యాబ్స్‌, వర్క్‌బుక్‌లను ప్రవేశపెడు తున్నారు. విద్యార్థులకు డిక్షనరీ ఇవ్వడం, డిక్షనరీని ఎలా చదవాలో చెప్పాలను కోవడం దేశంలో తొలిసారి అని విద్యావేత్తలు పేర్కొంటున్నారు. పిల్లల సంపూర్ణ వికాసానికి సరైన విద్య కీలకమన్న మహాత్మా గాంధీ వ్యాఖ్యలు ఆదర్శంగా ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్‌ రెడ్డి ప్రతి విద్యార్థిపై ప్రత్యేక దృష్టి సారించేలా కార్యక్రమాలు ప్రవేశపెడు తున్నారు. ఈ క్రమంలో ప్రాథమిక విద్యపై పటిష్టతకు ప్రాముఖ్యత కల్పిస్తున్నారు.
అలాగే ప్రభుత్వం పాఠశాలల్లో పిల్లల నమోదును గణనీయం గా పెంచడంతో పాటు-, మెరుగైన ఫలితాలు సాధించడమే ధ్యేయంగా జగనన్న విద్యాకానుకను అమలు చేస్తు న్నారు. రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ యాజమాన్య పాఠశాలల్లో చదివే విద్యార్థులకు అవసరమైన వస్తువు లను విద్యాకానుక కిట్ల రూపంలో అందిస్తున్నారు. అలాగే వైఎస్సార్‌ ప్రీ ప్రైమరీ స్కూళ్లలో ఇంగ్లీష్‌- తెలు గు డిక్షనరీ నుంచి రోజుకొక కొత్త పదం నేర్పించాలని, ఇదే తరహాలోనే అంగన్‌వాడీల్లో కూడా ఒక కార్యక్ర మాన్ని అమలు చేయాలని సీఎం ఇటీవల నిర్వహించిన సమీక్షలో సూచించారు. పోటీ ప్రపంచంలో ఉద్యోగాలు పొందాలంటే చిన్న వయసు నుంచే ఇంగ్లీష్‌ విద్యా విధానం ఉండాలని నిర్ణయించిన విషయం తెలిసిందే. ప్రభుత్వ పాఠశాలల్లో ఆంగ్ల మాధ్యమం ప్రవేశపెట్టడంపై అభిప్రాయసేకరణ నిర్వహించగా తల్లిదండ్రుల కమిటీలు- 93.88 శాతం, తల్లిదండ్రులు 96.17 శాతం ఆమోదం తెలిపారు. ఈ నేపథ్యంలో ఆంగ్ల మాధ్యమ బోధనతోపాటు రాష్ట్రవ్యాప్తంగా అన్ని పాఠశాలల్లో 1వ తరగతి నుంచి 10వ తరగతి వరకు తెలుగు ఒక భాషగా ఉండనుంది.
ప్రైవేట్‌ దోపిడీకి చెక్‌..
ప్రైవేట్‌ పాఠశాలల్లో ఫీజుల దోపిడీకి చెక్‌ చెప్పేలా ప్రభుత్వ పాఠశాలల్లోనే ఇంగ్లిష్‌ మీడియం అమలు నిర్ణయాన్ని ముఖ్యమంత్రి జగన్‌ తీసుకున్నారు. పాఠశాల స్థాయి నుంచే ఇంగ్లిష్‌ మీడియంలో చదువుకోవడం వల్ల విస్తృత ప్రయోజనం చేకూరుతుం దనే ఆలోచనతో ప్రభుత్వమే పూనుకో వాలనిభావిం చారు. ఇటీ-వల కేంద్ర మానవ వనరుల అభివృద్ధి మంత్రిత్వ శాఖ విడుదల చేసిన నూతన విద్యా విధానంలో సైతం పాఠశాల స్థాయిలో ఇంగ్లిష్‌ బోధన ప్రాధాన్యం, ఆవశ్యకతను ప్రత్యేకంగా ప్రస్తావించిన విషయం తెలిసిందే.
ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం ఒకటి నుంచి ఆరు తరగతులను ఈ విద్యా సంవత్సరం నుంచి, తదుపరి తరగతులను 2021-22 నుంచి ఇంగ్లీష్‌ మీడియంలోకి మార్చుతూ నిర్ణయం తీసుకుంది. మరోవైపు రాష్ట్రంలో సీబీఎస్‌ఈ(సెంట్రల్‌ బోర్డ్‌ ఆఫ్‌ సెకండరీ ఎడ్యుకేషన్‌) విధానం అమలుపైనా దృష్టి సారించారు. విద్యార్థులకు ఇంగ్లీష్‌ మీడియంలో బోధించడానికి ఉపాధ్యాయులకు అవసరమైన నైపుణ్యం, అవగాహన కల్పించేందుకు ఇప్పటికే శిక్షణ తరగతులు నిర్వహిస్తున్నారు. అలాగే హ్యాండ్‌ బుక్స్‌ రూపకల్పన, వాటిని అభివృద్ధి చేయడం, తరగతి గదుల్లో ఉత్తమ బోధన పద్ధతుల గురించి వివరించడం, టీ-చర్లకు అవసరమైన బోధన మెటీ-రియల్‌ను రూపొందించారు. విద్యార్థులకు బ్రిడ్జ్‌ కోర్సులతో పాటు- ఇంగ్లీష్‌ ల్యాబ్స్‌ ఉండేలా చర్యలు చేపట్టారు. మరోవైపు ఇంగ్లీష్‌ మీడియం ప్రాజెక్టు అమలు కోసం ఒక సీనియర్‌ ఐఏఎస్‌ను ప్రత్యేకాధికారిగా నియమించారు. ఇంగ్లీష్‌ భాషపై శిక్షణ కోసం వెబ్‌నార్‌లు నిర్వహించారు. మరోవైపు డీడీ సప్తగిరి ఛానల్‌ ద్వారా విద్యార్థులకు పాఠాలు బోధించారు. కరోనా విపత్కర సమయం లోనూ ఆన్‌లైన్‌ క్లాసులు నిర్వహించారు. అమ్మఒడి కింద విద్యార్థుల తల్లుల అకౌంట్‌లో ఏటా రూ. 15 వేలు అందజేస్తున్నారు. నాడు-నేడు ద్వారా ప్రభుత్వ స్కూళ్ల రూపురేఖలు మారుస్తున్నారు. పౌష్టికాహారం అందించేందుకు మంచి మెనూతో జగనన్న గోరుముద్ద పథకం తీసుకొచ్చారు. జగనన్న వసతి దీవెన, జగనన్న విద్యాదీవెన ద్వారా ఉన్నతవిద్యకు తోడ్పాటు-నందిస్తున్నారు.
ఈ విద్యా సంవత్సరానికిగాను జగనన్న విద్యా కానుక పథకం కోసం ప్రభుత్వం ఇప్పటికే పాఠశాల విద్యాశాఖకు పరిపాలనా అనుమతులు మంజూరు చేసింది. అలాగే దాదాపు రూ.100 కోట్ల మేర నిధులు పెంచింది. ప్రభుత్వ, ఎయిడెడ్‌ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య రోజురోజుకు పెరగుతుండటంతో ఆమేరకు నిధులు ఎక్కువగా కేటాయించింది. అన్ని ప్రభుత్వ యాజమాన్య పాఠశాలల్లో 1 నుంచి 10వ తరగతి వరకు చదువుతున్న దాదాపు 43 లక్షల మంది విద్యార్థులకు ఈ కిట్లు- అందించనున్నారు. గతేడాది విద్యా కానుక కోసం ప్రభుత్వం రూ. 648.10 కోట్లకుపైగా వెచ్చించగా, ఈ ఏడాది రూ. 731.30 కోట్లను మంజూరు చేసింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement