Tuesday, November 26, 2024

పింగ‌ళి వెంక‌య్య కుమార్తెను స‌త్క‌రించిన జ‌గ‌న్..

గుంటూరు: దేశానికి స్వాతంత్య్రం వచ్చి 75 సంవత్సరాలు పూర్తి కాబోతున్న సందర్భంగా అజాదీ కా అమృత్ ఉత్స‌వ్ పేరుతో వేడుకలు నిర్వహించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించిన నేపథ్యంలో జాతీయ పతాక రూపకర్త పింగళి వెంకయ్య కుటుంబసభ్యులకు సన్మానంతో ఎపిలో ఈ వేడుకలను సీఎం వైఎస్‌ జగన్ శ్రీకారం చుట్టారు.. ఈ స‌త్కార కార్య‌క్ర‌మం నిర్వ‌హించేందుకు ముఖ్యమంత్రి మాచర్లలో నివసిస్తున్న‌ జాతీయ జెండా రూపకర్త పింగళి వెంకయ్య కుటుంబం వ‌ద్ద‌కు వెళ్లారు.. సీఎం జగన్‌ను చూసి పింగళి వెంకయ్య కుటుంబ సభ్యులు ఉద్వేగానికి లోనయ్యారు. స్వాతంత్య్ర ఉద్యమ స్ఫూర్తిని సీఎం జగన్‌తో కలిసి పంచుకున్నారు. సీఎం వైఎస్‌ జగన్ పింగళి వెంకయ్య కుమార్తె సీతామహాలక్ష్మి యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు. అనంత‌రం సీతామ‌హాల‌క్షీని జాతీయ ప‌త‌కం క‌ప్పి స‌త్క‌రించారు.. ప్ర‌భుత్వం త‌రుపున జ్ఞాపిక‌ను ఆమెకు అంద‌జేశారు.. ఇదే సందర్భంగా సీతామహాలక్ష్మికి రూ.75 లక్షల ఆర్థికసాయం ఆర్థికసాయం తాలూకు ఉత్తర్వుల ప్రతిని సీఎం ఆమెకు అందజేశారు. అనంతరం నగదును ఆమె ఖాతాలో జమ చేశారు.ఈ సంద‌ర్భంగా ఇక్క‌డ ఏర్పాటు చేసిన పింగళి జీవిత విశేషాలతో కూడిన చిత్రాలను సీఎం తిలకించారు. స‌త్కారం అనంత‌రం సీతామ‌హాల‌క్షి మాట్లాడుతూ, జగన్‌ సీఎంగా కాదు.. ఒక ఆత్మీయుడిగా పలకరించాంటూ ఉద్వేగానికి లోన‌య్యారు. సీఎం జగన్‌ పలకరింపుతో వందేళ్ల ఆయుష్షు వచ్చిందన్నారు. జాతీయ జెండాను గాంధీకి స్వయంగా పింగళి వెంకయ్య అందించారని, తండ్రిగా పింగళి వెంకయ్య తనను గాంధీకి పరిచయం చేశారని ఆమె ఆనాటి జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement