Friday, September 20, 2024

టిడిపి నేత‌, మాజీ మంత్రి నారాయణ ఇంటిలో సిఐడి సోదాలు…..

అమ‌రావ‌తి – అమ‌రావ‌తి అసైన్డ్ భూముల వ్య‌వ‌హారంలో సిఐడి ముందు హాజ‌రుకావాల‌ని నోటీసులు అందుకున్న టిడిపి నేత‌, మాజీ మంత్రి నారాయ‌ణ ఇంటిపై సిఐడి అధికారులు దాడి చేశారు. విజ‌య‌వాడ‌, హైద‌రాబాద్, నెల్లూరులలో ఉన్న ఆయ‌న ఇళ్లు, కార్యాల‌యాల‌పై నేటి ఉద‌యం సిఐడి అధికారులు దాడి చేసి సోదాలు చేపట్టారు.. అలాగే ఆయ‌న స‌న్నిహితులు,బంధువుల ఇళ్ల‌పై కూడా సిఐడి అధికారులు సోదాలు జ‌రుపుతున్నారు.. దీనిపై మ‌రిన్ని వివ‌రాలు తెలియాల్సి ఉంది..

Advertisement

తాజా వార్తలు

Advertisement