అమరావతి – విశాఖ స్టీల్ ప్లాంట్ వంద శాతం వాటాలను అమ్మివేస్తామని, ఈ విషయాన్ని ఎపి ముఖ్యమంత్రి జగన్ కు ముందే చెప్పామని కేంద్ర ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్ పార్లమెంట్ లో చేసిన ప్రకటన వైసిపి ప్రభుత్వాన్ని ఇరకాటంలో పడేసింది.. ఈ ప్రకటనతో విశాఖలో ఆందోళలను కార్మికులు మరింత ఉధృతం చేశారు.. ఆందోళనలో భాగంగా అటు ప్రధాని, ఇటు జగన్ దిష్టి బొమ్మలను సైతం దగ్ధం చేశారు… ఈ నేపథ్యంలో జగన్ దిద్దుబాటు చర్యలకు శ్రీకారం చుట్టారు.. అఖిల పక్షం, కార్మిక సంఘాల నేతలతో కలసి ప్రధాని మోడీని కలవాలని నిర్ణయించారు.. విశాఖ స్టీల్ పై స్వయంగా ప్రధానికి వివరించాలని జగన్ భావిస్తున్నారు.. ఈ మేరకు జగన్ ప్రధాని మోడీకి లేఖ రాశారు.. ఆ లేఖలో విశాఖ స్టీల్ ప్రైవేటీకరణ నిర్ణయాన్ని పునారాలోచించాలని ప్రధానిని అభ్యర్ధించారు..‘‘కేంద్ర ప్రకటన తీవ్ర ఆందోళనకు గురిచేస్తోంది. విశాఖ స్టీల్‌ప్లాంట్ ఆంధ్రుల మనోభావాలతో ముడిపడిన అంశం. స్టీల్‌ప్లాంట్‌పై ప్రత్యక్షంగా 20వేల కుటుంబాలు ఆధారపడ్డాయి. అఖిలపక్షం, కార్మిక సంఘాల ప్రతినిధులను వెంట తీసుకొస్తాం. ఏపీ ప్రజలు, కార్మికుల అభిప్రాయాలను మీ ముందు ఉంచుతాం. ప్లాంట్ పునరుద్ధరణకై మన ముందున్న ఆప్షన్లను నేరుగా వివరిస్తాం’’ అని ఆ లేఖలో ప్రస్తావించారు జగన్..స్వయంగా అన్ని విషయాలు వివరించేందుకు అఖిల పక్ష బృందంతో వచ్చే తనకు అపాయింట్ మెంట్ ఇవ్వవలసిందిగా అదే లేఖలో కోరారు జగన్.
Advertisement
తాజా వార్తలు
Advertisement