అమరావతి – ఎపి ముఖ్యమంత్రి జగన్ నివాసముంటున్న తాడేపల్లి గ్రామంలో ఒక్క రోజే 16 కరోనా కేసులు నమోదయ్యాయి.. దీంతో వైద్యాధికారులు అప్రమత్తమయ్యారు. ఈ కరోనా సోకిన వారిలో అధిక శాతం మంది మునిసిపల్ శాఖ ఉద్యోగుల కావడంతో ఆ శాఖలో పని చేస్తున్న సిబ్బందికి కరోనా పరీక్షలు నిర్వహిస్తున్నారు.. అలాగే ఎక్కువుగా కరోనా కేసులు నమోదైన ప్రాంతాలను గుర్తించి వెంటనే అక్కడ కంటోన్మెంట్ జోన్ గా ప్రకటించారు.. అ ప్రాంతం అంతా బ్లీచింగ్, శానిటైజేషన్ చేశారు. ప్రజలను సైతం అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరించారు.. కరోనా పట్ల నిర్లక్ష్యంగా ఉండకుండా మాస్కులు వాడుతూ భౌతిక దూరం పాటిస్తూ నిత్యం అప్రమత్తంగా ఉండాలని డాక్టర్ కిరణ్ కోరారు…
Advertisement
తాజా వార్తలు
Advertisement