అమరావతి, : రాజధాని అమరావతిలో అసైన్డ్ భూముల కొనుగోళ్లకు సంబంధించి అభియో గాలు ఎదుర్కొంటున్న మాజీ ముఖ్యమంత్రి, ప్రతిపక్షనేత చంద్ర బాబుపై సీఐడీ అధికారులు నాన్ బెయిలబుల్, బెయిలబుల్ కేసులతో పాటు విచారణకు రాకపోతే అభిజ్ఞ నేరం కింద నేరుగా అరెస్ట్ చేసే విధంగా ఎఫ్‌ఐఆర్ రూపొందించారు. సీఐడీ జాబితాలో ఏ-1గా చంద్రబాబు, ఏ-2గా మాజీ మంత్రి పి నారా యణను చేర్చారు. ల్యాండ్ పూలింగ్ సమయంలో గుంటూరు జిల్లా కలెక్టర్ గా వ్యవహరించిన ఐఏఎస్ అధికారి కాంతీలాల్ దండేకు సెక్షన్ 160 కింద షోకాజ్ నోటీస్ జారీ చేసింది. ఇందులో దళితుల భూములను బలవంతంగా స్వాధీనం చేసుకోవటం, బెదిరింపులకు సం బంధించి 1989 ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ యాక్ట్ చట్టంలోని సెక్షన్ 3-1 (ఎఫ్, జీ) నాన్ బెయిలబుల్ పరిధిలోకి వస్తుంది.. రాజ ధాని ప్రాంతంలో 500 ఎకరాల దళితుల అసైన్డ్ భూముల కొనుగోళ్లతో పాటు వాటిని అనుభవదార్లను కాదని కొను గోలుదార్లకు ల్యాండ్ పూలింగ్ కింద ప్రత్యామ్నాయ స్థలాల ను కేటాయించారనేది అభియోగం. దళితులకు కేటాయిం చిన అసైన్డ్ భూముల కబ్జాకు సంబంధించి నమోదైన ఈ సెక్షన్ ప్రకారం ఆరు నెలల నుంచి ఐదేళ్ల జైలు శిక్షతో పాటు రూ. 5వేల వరకు జరిమానా ఉంటుంది. అంతేకాదు ఆ భూములను మూడు నెలల్లోగా తిరిగి స్వాధీన పరచాల్సి ఉంటుంది. ఇక అసైన్డ్ భూముల క్రయ, విక్రయాలకు సంబంధించి ఏపీ ఎలినేషన్ యాక్ట్ – 19777 సెక్షన్ 7 ప్రకారం నిబంధనలు ఉల్లంఘించి ఎన్‌ఓసీలు జారీ చేయిం చుకుని రెగ్యులరైజ్ చేయించటం అధికారులపై ఒత్తిడి తీసుకు రావటం వంటి నేరాలకు వర్తిస్తుంది. ఈ సెక్షన్ కింద కేసు నమోదైతే సంబంధిత భూములను తిరిగి స్వాధీనం చేయ టంతో పాటు నేరం రుజువైతే ఆరు నెలల జైలు, రూ. 10 వేల వరకు జరిమానా విధిస్తారు. ఇక సెక్షన్ 120(బీ) నేరంలో సూత్రదారుల ప్రమేయానికి సంబంధించింది. పథకం ప్రకా రం భూముల కబ్జా చేయటం, ఇతర నేరాలపై ఈ కేసు నమోదవుతుంది. చీటింగ్ కేసు కింద కూడా దీన్ని మార్చే అవకాశాలు ఉన్నట్లు సమాచారం. ఈ కేసులో నిజ నిర్థారణ జరిగితే రెండేళ్ల నుంచి ఐదేళ్ల జైలుతో పాటు జరిమానా విధిస్తారు. ఇక చంద్రబాబుపై నమోదైన బెయిలబుల్ కేసుల్లో ఐపీసీ 166, 167, 217 రెడ్ విత్ 34,35, 36,37 సెక్షన్లు ప్రభుత్వ సేవకునిగా ఉంటూ చట్టాన్ని తన చేతుల్లోకి తీసుకుని అక్రమాలకు పాల్పడిన నేరాలకు సంబంధించింది. ఐపీసీ 166 కింద 6 నుంచి ఏడాది జైలు శిక్ష, జరిమానా, 167 కింద మూడేళ్ల లోపు జైలు శిక్ష, జరిమానా, 217 కింద రెండేళ్ల జైలు, జరిమానా విధిస్తారు. అయితే చంద్రబాబు, మాజీ మంత్రి నారాయణపై నమోదైన ఈ కేసుల్లో ప్రధానంగా ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ, అసైన్డ్ ల్యాండ్ యాక్ట్‌కు సంబంధించినవే కీలకమై నవిగా చెబుతున్నారు. వీటిలో ఎప్పుడైనా కోర్టు అనుమతి లే కపోయినా అరెస్ట్ చేసే అధికారం పోలీసులకు ఉందని సమాచారం. ఇదే విషయాన్ని సీఐడీ నోటీసు స్పష్టం చేస్తోంది. ఈనెల 23న విచారణకు హాజరు కాకపోతే అరెస్ట్ చేయక తప్పదనే హెచ్చరిక కూడా జారీ చేసింది.
Advertisement
తాజా వార్తలు
Advertisement