Wednesday, November 20, 2024

గుంటూరు కార్పొరేష‌న్ తో స‌హా జిల్లాలో అన్ని మునిసిపాలిటీల‌లో వైసిపి పాగా..

గుంటూరు జిల్లా లో జ‌రిగిన మునిసిప‌ల్ ఎన్నిక‌ల‌లో వైసిపి క్లీన్ స్వీప్ చేసింది.. గుంటూరు కార్పొరేష‌న్ తో సహా ఈ జిల్లాలో మొత్తం ఏడు మునిసిపాల్టీల‌ను వైసిపి కైవ‌సం చేసుకుంది.. అయితే కోర్టు ఆదేశాల‌తో చిల‌క‌లూరిపేట ఫ‌లితాల‌ను పెండింగ్ లో ఉంచారు.. గుంటూరు కార్పొరేష‌న్ లో మొత్తం 57 డివిజ‌న్ లు ఉండ‌గా వైసిపి ఇప్ప‌టి వ‌ర‌కు 37 డివిజ‌న్ లు గెలిచి కార్పొరేష‌న్ ను ద‌క్కించుకుంది.. ఇక్క‌డ వైసిపి రెబెల్ అభ్య‌ర్ధులు విజ‌యం సాధించ‌గా, జ‌న‌సేన రెండో చోట్ల‌, టిడిపి రెండు డివిజ‌న్ ల‌లో గెలిచింది.. వైసిపి విజ‌యం సాధించిన మునిసిపాలిటీలు రేపల్లె , తెనాలి , వినుకొండ , మాచర్ల , పిడుగురాళ్ల , సత్తెనపల్లి

గుంటూరు జిల్లాలో వైఎస్ఆర్‌సీపీ క్లీన్‌స్వీప్‌
గుంటూరు కార్పొరేషన్‌ వైఎస్ఆర్‌సీపీ కైవసం
గుంటూరు (57): ఎస్ఆర్‌సీపీ-45, టీడీపీ-8, బీజేపీ+ 4, ఇతరులు 2
తెనాలి మున్సిపాలిటీ వైఎస్ఆర్‌సీపీ కైవసం
తెనాలి (40): వైఎస్ఆర్‌సీపీ-32, టీడీపీ-8
చిలకలూరిపేట మున్సిపాలిటీ వైఎస్ఆర్‌సీపీ కైవసం
చిలకలూరిపేట (38): వైఎస్ఆర్‌సీపీ-30, టీడీపీ-8
రేపల్లె మున్సిపాలిటీ వైఎస్ఆర్‌సీపీ కైవసం
రేపల్లె (28): వైఎస్ఆర్‌సీపీ-26, టీడీపీ-2
సత్తెనపల్లి మున్సిపాలిటీ వైఎస్ఆర్‌సీపీ కైవసం
సత్తెనపల్లి (31): వైఎస్ఆర్‌సీపీ-24, టీడీపీ-4, బీజేపీ-1, ఇతరులు -2
వినుకొండ మున్సిపాలిటీ వైఎస్ఆర్‌సీపీ కైవసం
వినుకొండ (32): వైఎస్ఆర్‌సీపీ-28, టీడీపీ-4
మాచర్ల మున్సిపాలిటీ వైఎస్ఆర్‌సీపీ కైవసం
మాచర్ల (31): వైఎస్ఆర్‌సీపీ-31, టీడీపీ-0
పిడుగురాళ్ల మున్సిపాలిటీ వైఎస్ఆర్‌సీపీ కైవసం
పిడుగురాళ్ల (33): వైఎస్ఆర్‌సీపీ -33, టీడీపీ-0

Advertisement

తాజా వార్తలు

Advertisement