Sunday, September 8, 2024

గుంటూరులో ప్రారంభమైన ఎమ్మెల్సీ ఎన్నిక‌ల బ్యాలెట్స్ లెక్కింపు..

గుంటూరు : కృష్ణా-గుంటూరు జిల్లాల ఎమ్మెల్సీ స్థానాలకు జరిగి న ఎన్నికల్లో పోలైన ఓట్ల లెక్కింపు నేటి ఉదయం గుంటూరు ఎసి క‌ళాశాల‌లో ప్రారంభమైంది. ఉభయ జిల్లాల్లో కలిపి 13,505 ఓట్లు ఉండగా 12,554 పోలయ్యాయి . ఈ ఓట్ల లెక్కింపు ని వేగవంతంగా పూర్తి చేసేందుకు 14 కౌంటింగ్‌ టేబుల్స్‌ ఏర్పాటు- చేశారు. ప్రతీ టేబుల్‌కు ఒక తహసీల్దార్‌, ఎంపీ డీవో, ఈవోఆర్‌డీ స్థాయి అధికారి ఒకరిని నియమిం చారు. కౌంటింగ్‌ అసిస్టెంట్‌లుగా ఒక్కో టేబుల్‌కి డిప్యూటీ- తహసీల్దార్‌, ఇద్దరు వీఆర్‌వోలు ఉంటారు. మొత్తం 14 టేబుళ్లకు 14 బృందాలను నియమించడం జరిగింది. ప్రతి షిష్ట్ కి అదనంగా రెండు టీమ్ లని రిజ ర్వుడ్‌లో ఉంచారు. లెక్కింపును 24 గంటల్లో జరిగేలా ఎనిమిది గంటలకు ఒక షిప్ట్ చొప్పున మూడు షిప్ట ల్లో కౌంటింగ్‌ సిబ్బందిని నియమించారు. లెక్కింపులో ఎటువంటి పొరపాట్లకు తావులేకుండా ఓట్ల లెక్కింపు విధులు బాధ్యతగా నిర్వహించేలా ఈ ప్రక్రియకు సారధ్యం వహిస్తున్న జాయింట్ కలెక్ట‌ర్ శ్రీధర్‌రెడ్డి సార‌ధ్యం వ‌హిస్తున్నారు.. కాగా పోలింగ్ ట్రెండ్ ఈ సాయంత్రానికి వెలువ‌డే అవ‌కాశం ఉంది.

ఫ‌లితాల‌పై ఉత్కంఠ‌..
పురపాలక ఎన్నికల నేపథ్యంలో ఈ ఎన్నికలను ప్రధాన రాజకీయ పార్టీలు ప్రతిష్ఠాత్మకంగా తీసుకోక పోయినా రంగంలో గట్టి పోటీ నిచ్చే ఉపాధ్యాయ సంఘాలు, విద్యారంగానికి చెందిన అభ్యర్థులతో పాటు- బలమైన స్వతంత్ర అభ్యర్థులు బరిలో నిలవడంతో రసవత్తర పోరు కొనసాగింది. దీనికితోడు ఈ ఎన్నికల్లో ఓటర్లు సైతం అదే స్థాయిలో పోటెత్తడం మరో రికార్డు. దీంతో ఓట్ల లెక్కింపుపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. సాధారణ ఎన్నికలతో పోలిస్తే ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటు వేసే విధానంలోనే కాదు.. ఓట్ల లెక్కింపు విధానంలోనూ ఎంతో విభిన్నత కనబడు తుంది. సాధారణ ఎన్నికల్లో అయితే ప్రత్యర్థి కంటే ఒక్క ఓటు- ఎక్కువ వచ్చినా విజేతగా ప్రకటిస్తారు. కానీ ఇక్కడ అలా కాదు. ప్రాధాన్యతా ఓట్ల విధానంలో ఫలితాలు ఎప్పుడు, ఎటు- మారతాయో చెప్పడం కష్టం. ఫలితాలపై బరిలో నిలిచిన అభ్యర్థు లు, వారిని బలపరిచిన ఉపాధ్యా య సంఘాల్లో ఉత్కంఠ నెలకొంది ఈ స్థానం నుంచి మొత్తం 19 మంది అభ్యర్థులు తలపడ్డారు. వీరిలో ఐదారుగురు మధ్యే ప్రధానంగా పోటీ నెలకొందని చెబుతున్నారు. ప్రస్తుత ఎమ్మెల్సీ ఏఎస్‌ రామకృష్ణ, టి.కల్పలత, బొడ్డు నాగేశ్వరరావు, పి.పాండురంగ వరప్రసాద్‌, పి.వి.మల్లి కార్జునరావు, చందు రామా రావుల మధ్యే ఫలితం దోబుచూలాడే అవకాశం ఉందని ఉపాధ్యాయవర్గంలో చర్చ జరుగుతోంది. ఈ సారి బరిలో ఉన్న అభ్యర్థులు భారీగా డబ్బులు పంచడంతో ఫలితాలు తారుమారయ్యే అవకాశం ఉన్నట్లు- చెబుతున్నారు. ఎవరు ఎక్కువ ఓట్లు- చీల్చుకుంటే ఎవరు గెలుస్తారనే విషయం పై చర్చ జరుగుతోంది. గతంలో మాదిరి మొదటి ప్రాధాన్యత ఓట్లతోనే గెలిచే పరిస్థితి ఎవరికీ ఉండదని, ఎలిమినేషన్‌ ప్రాసెస్‌ విధానంలోనే విజయం సాధ్యపడుతుందని అంటున్నారు. కాగా ప్రస్తుత ఎమ్మెల్సీ ఏఎస్‌ రామకృష్ణకు అధ్యాపకవర్గాల నుంచి బాగా ఓట్లు పడ్డాయని చెప్పుకుంటున్నారు. బొడ్డు
నాగేశ్వరావు, పి.పాండురంగ వరప్రసాద్‌, చందు రామారావు, కల్పలత, పీవీ మల్లి కార్జునరావులకు ప్రభుత్వ ఉపాధ్యాయులు, చందు రామారావుకు ప్రైవేటు విద్యా సంస్థల్లో పనిచేసే ఉపాధ్యాయులు, అధ్యాపకుల ఓట్లు బాగా పడ్డాయని అంటున్నారు. మరికొందరు బరిలో నిలిచిన అభ్యర్థుల సామాజిక వర్గాలను చూసి కొందరు ఓట్లేశారని ప్రచారం జరుగుతోంది. ఉపాధ్యాయ మండలి ఎన్నికల్లోనూ డబ్బు ప్రభావమే బాగా పనిచేసిందని అంటు న్నారు. దీంతో గెలుపుపై బరిలో ఉన్న ప్రధాన అభ్యర్థులు గెలుపుపై ఎవరి ధీమా వారిదే అన్నట్లు గా వున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement