రాజుపాలెం – దేవరంపాడు కొండ గోవిందా నామ స్మరణతో మార్మోగింది ,ఇసుక వేస్తె రాలనంత భక్తులతో కిటకిట లాడింది ,తీవ్ర ఎండను సైతం లెక్క చెయ్యకుండా భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు ,మహిళ భక్తులు పొంగల్లు పొంగించి తమ మొక్కులు చెలించుకున్నారు ,రైతులు పాడి పంటలు బాగుండాలని తమ వృషభ రాజాలను ఆలయం చుట్టు గిరి ప్రదక్షణ చేయించారు. తొలత శాసన సభ్యుడు అంబటి రాంబాబు దంపతులు స్వామివారిని దర్శించుకున్నారు.. ఆలయానికి చేరుకున్న ఆయనకు వేద పండితులు పూర్ణ కుంభంతో స్వాగతం పలికారు.. దర్శనానంతరం ఆలయ కార్యనిర్వహణాధికారి సత్యనారయణ రెడ్డి ఎమ్మెల్యేకి శాలువా కప్పి సన్మానించారు . శాసన సభ్యుడితో పాటు సత్తెనపల్లి మున్సిపల్ చైర్మన్ చల్లం చర్ల లక్శ్మి తులసి స్వామివారిని దర్శించుకున్నారు. కాగా, ఉత్సవాల సందర్భంగా భక్తులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా ఆలయ చలువ పందిళ్లు వేశారు. తాగునీటి వసతి కల్పించారు. ,పిడుగురాళ్లకు చెందిన భక్తులు ఎండా వేడినుండి ఉపశమనం కోసం చల్లని మజ్జిగ పంపిణీచేసారు ,రాజుపాలెం వైద్యసిబ్బంది తిరునాళ్లకు వచ్చిన భక్తులకు ప్రమాదం జరిగితె చికిత్స కోసం వైద్య శిబిరం ఏర్పాటు చేసారు తిరునాళ్లలో ఎలాంటి అవాంచనీయ సంఘటనలు జరగకుండ ఎస్ ఐ కొలగట్ల అమీర్ పటిష్ట బందోబస్తు ఎర్పాటు చెసారు
Advertisement
తాజా వార్తలు
Advertisement