గుంటూరు మెడికల్ – కరోన నేపథ్యంలో రోగులకు హౌస్ సర్జన్లు చేసిన సేవలు మరువలేమని ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ నీలం ప్రభావతి అన్నారు. సర్వజన ఆసుపత్రి సుశ్రుత హాలులో గురువారం హౌస్ సర్జన్ల సేవలకు ప్రసంశ పత్రాలను అందచేసిన అనంతరం ఆమె ప్రసంగిస్తూ, గత ఏడాది కరోన మహామ్మరి విస్తరిస్తున్న సమయంలో హౌస్ సర్జన్ లు ముందుకు వచ్చి రోగుల ప్రాణాలను కాపాడారని ఆమెగుర్తుచేశారు.తల్లితండ్రులు సైతం వారి ని ఆసుపత్రికి పంపించి విధులు నిర్వర్తించే విధంగా సహాయపడ్డారని ఆమె చెప్పారు.జీవితంలో మరింతగా కష్టపడి ఉన్నత లక్ష్యాల వైపు పయనించాలని ఆమె ఆకాక్షించారు. ఆర్ధోపెడిక్ విభాగం ఆచార్యులు డాక్టర్ వరప్రసాద్ మాట్లాడుతూ కోవిడ్ సమయంలో హౌస్ సర్జన్ల సేవలు విలువ కట్టలేమన్నారు. హౌస్ సర్జన్ల సేవలకు గుర్తింపుగా ప్రసంశ పత్రాలను అంద చేయడం ఇక్కడే సాధ్యమైందని ఆయన అన్నారు.హౌస్ సర్జన్ ల అసోసియేషన్ అధ్యక్షుడు వినయ్ మాట్లాడుతూ ఈ ఆసుపత్రిలో పని చేయడం ఎంతో ఆనందాన్ని కలిగించిందని అన్నారు. ఈ కార్యక్రమంలో ప్లాస్టిక్ సర్జరీ విభాగం ఆచార్యులు డాక్టర్ మార్కెన్దేయులు , సివిల్ సర్జన్ ఆర్ యం ఓ డాక్టర్ సతీష్ కుమార్, ఏ డి నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.
Advertisement
తాజా వార్తలు
Advertisement