Friday, November 22, 2024

ఎమ్మెల్సీ ఎన్నికలు – లీడ్ లో కల్పలత

గుంటూరు, కృష్ణా జిల్లాల ఉపాధ్యాయ ఇయోజకవర్గ ఎమ్మెల్సీ ఓట్ల లెక్కింపు ఉత్కంఠ భరితంగా కొనసాగుతున్నది.విజేతగా నిలవాలంటే నిర్దేశిత కోటా ఓటు 6,153 రావాలి.మొదటి ప్రాధాన్యత ఓటులో ఎవరికీ కోటా ఓటు రాకపోవటంతో తదుపరి ప్రాధాన్యతా ఓట్ల లెక్కింపు కొనసాగుతున్నది.తాజా సమాచారం ప్రకారం మొదటిస్థానంలో తమటం కల్పలత, రెండవ స్థానంలో బొడ్డు నాగేశ్వరరావు, మూడవ స్థానంలో డాక్టర్ ఎ ఎస్ రామకృష్ణ, 4 వ స్థానంలో చందు రామారావు, 5 వ స్థానంలో పి వీ మల్లిఖార్జున రావు లు కొనసాగుతున్నారు. మొదటి స్థానంలో నిలిచిన అభ్యర్థి కల్పలత కు 3,870 మొదటి ప్రాధాన్యత ఓట్లు లభించాయి. ద్వితీయ స్థానంలో వున్న బొడ్డు నాగేశ్వర రావు కు 2,831 ఓట్లు, తృతీయ స్థానంలో వున్న సిట్టింగ్ ఎమ్మెల్సీ డాక్టర్ ఎ ఎస్ రామకృష్ణ కు 1,958 ఓట్లు మొదటి ప్రాధాన్యత గా వచ్చాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement