అమరావతి, : కృష్ణా -గుంటూరు జిల్లాల ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికలు ఆసక్తికరంగా మారాయి. ఈ ఎన్నికలకు అధికార వైకాపా దూరంగా ఉండగా, విపక్ష తెదేపా ప్రస్తుత ఎమ్మెల్సీ ఏఎస్ రామకృష్ణకు మద్దతు తెలిపింది. ఈ సారి ఎన్నికల్లో ఉపాధ్యాయ-విద్యారంగ అభ్యర్థుల మధ్య పోటీ- నువ్వా నేనా అన్నట్లు-గా ఉంది. ఎమ్మెల్సీ ఎన్నికలు పోలింగ్ రేపు జరగనున్నాయి. ఈ నెల 29వ తేదీ కృష్ణా-గుంటూరు జిల్లాల నుంచి ప్రస్తుతం టీ-చర్ ఎమ్మెల్సీగా కొనసాగుతున్న ఏఎస్ రామకృష్ణ పదవీ కాలం ముగియనుంది. దీంతో ఎన్నిక జరుగుతోంది. మొత్తంగా 19 మంది అభ్యర్థులు బరిలో దిగనున్నారు. ప్రధాన పార్టీలు అభ్యర్థులు నిలపకున్నా.. ప్రస్తుతం టీ-చర్ ఎమ్మెల్సీగా కొననసాగుతూ తిరిగి పోటీ- చేస్తున్న ఏఎస్ రామకృష్ణకు తెదేపా మద్దతిస్తోంది. ఈ క్రమంలో రెండు జిల్లాల్లోని తెలుగుదేశం నేతలు ఏఎస్ రామకృష్ణకు ఓట్లేయించేందుకు తమ వంతు సహకారం అందిస్తున్నారు. అయితే అధికార వైకాపా పోటీ- చేయడం లేదని ప్రకటించినా పీఆర్టీయూ మద్దతుతో రంగంలో ఉన్న కల్పలతకు పరోక్షంగా వైకాపా మద్దతు ఉన్నట్లు- చెబుతున్నారు. ఇక మిగిలిన అభ్యర్థుల విషయానికొస్తే పీడీఎఫ్ నుంచి మాజీ ఎమ్మెల్సీ బొడ్డు నాగేశ్వరరావు, ఎస్టీయూ నుంచి పీవీ మల్లిఖార్జున రావు, ఏపీటీ-ఎఫ్ నుంచి పాండురంగ వరప్రసాద్, విద్యారంగం నుంచి చందు రామారావులు ప్రధానంగా బరిలో ఉన్నారు. వీరితో పాటు- కనకం శ్రీనివాసరావు, ఓంకారయ్య, కన్నెబోయిన వంశీకృష్ణ, , కోట సాయి కృష్ణ, గాదె వెంకటేశ్వరరావు, ఎర్రాకుల తులసీరాం, ప్రోఫెసర్ దారా విక్రమ్, నాగస్వరం నాగేశ్వరరావు, బట్టు- శ్యామ్ ప్రసాద్ , మత్తి కమలాకర్ రావు, , రాంబాబు చెన్నకేశవులు, డాక్టర్ ఎం. రామకోటయ్య, సురే సాగర్ బాబులు పోటీ-లో ఉన్నారు. ఈ క్రమంలో పోటీ- గట్టిగా ఉండనుంది. అయితే పోటీ- ప్రధానంగా బొడ్డు నాగేశ్వరరావు, ఎస్ రామకృష్ణల మధ్యే ఉన్నట్లు- సమాచారం. పీఆర్టీయూ అభ్యర్థి కల్పలత, ఎస్టీయూ పీవీ మల్లిఖార్జున రావు, ఏపీటీ-ఎఫ్ పాండురంగ వరప్రసాద్ లు ఓట్లు- చీల్చుకునే దానిపై నాగేశ్వరరావు, రామకృష్ణల జయాపజయాలు వుంటాయని చెబుతున్నారు. ఈసారి టీ-చర్ ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారానికి సంబంధించి అభ్యర్థులు కూడా తమ ప్రచారాన్ని ఎక్కువగా సోషల్ మీడియా, వాట్స్యాప్ గ్రూపులు తదితర ప్రసార మాధ్యమల ద్వారా నిర్వహించారు అభ్యర్థులు ఓటర్ల జాబితా దగ్గర పెట్టు-కుని ఒక్కొక్కరికి ఫోన్లు చేస్తూ ఓటేయాల్సిందిగా అభ్యర్దించారు. పోటీ-లో ఉన్న అభ్యర్థులు ప్రచారంలో భాగంగా రెండు జిల్లాల్లోని ఉన్నత పాఠశాలలు, ఇంటర్, డిగ్రీ కళాశాలలు, విశ్వవిద్యాలయాలు, ఆదర్శ పాఠశాలలు, కేజీబీవీలు, గురుకుల పాఠశాలలు, ఐటీ-ఐ, పాలి-టె-క్నిక్లను సందర్శించి ఓట్లు- అభ్యర్థించారు.
ఎమ్మెల్సీ ఎన్నికల్లో జోరుగా డబ్బు పంపిణీ
సాధారణ ఎన్నికల్లో మాదిరి ఉపాధ్యాయ ఎన్నికల్లో ఓటర్లు అయిన ఉపాధ్యాయులను నోటుతో ఆకట్టుకోవాలనే ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఎమ్మెల్సీ ఎన్నికల్లో జోరుగా డబ్బు పంపిణీ జరుగుతోంది. కృష్ణా -గుంటూరు జిల్లాల టీ-చర్స్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో డబ్బుపంచుతూ ఓ గ్యాంగ్ దొరికిపోయింది. మచిలీపట్నంలో ఓటర్లకు డబ్బులు పంచుతూ కొందరు దొరికిపోయారు. ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో ఈ ఘటన సంచలనం సృష్టించింది. కవర్లలో డబ్బులు పెట్టి తీసుకున్నా.. తీసుకోకున్నా.. కొందరు టీచర్లకు డబ్బులు ఎర వేస్తున్నారు. ఒక్కొక్కొ ఓటుకు దాదాపు 3వేల నుంచి ఐదువేల రూపాయలు పంచుతున్నట్లు తెలుస్తోంది. .ఈ విషయం తెలుసుకున్న యూటీ-ఎఫ్ నాయకులు వారిని రెడ్ హ్యాండెడ్గా పట్టు-కున్నారు. కాగాసమాజంలో ఉపాద్యాయులు అంటే ఓ మంచి అభిప్రాయం ఉంది. ఇలా డబ్బులు పంచి ఓట్లు- కొని.. ఆ అభిప్రా యాన్ని మార్చొద్దని కొందరు ఉపాధ్యాయులు పేర్కొన్నారు. ఉపా ధ్యాయ, విద్యా రంగ సమస్యలపై అవగాహన, సమస్యల పరిష్కా రంలో రాజకీయ ఒత్తిళ్లు అధిగమించి పనిచేస్తారను కునె వారు ఎమ్మె ల్సీలుగా ఎన్నికైతేనే ఉపాధ్యాయవర్గానికి మేలు జరుగు తుందని, అలాంటి వారిని న్నుకుంటామని మరికొందరు తెలిపారు.
ఎపిలో రెండు ఎమ్మెల్సీ స్థానాల పోలింగ్ కు సర్వం సిద్ధం..
Advertisement
తాజా వార్తలు
Advertisement