గుంటూరు….ఎపిలో మున్సిపల్, నగర పాలక సంస్థల ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతున్నది.. మొత్తం 12 నగర పాలక సంస్థలకు, 71 మునిసిపాలిటీలకు పోలింగ్ నేటి ఉదయం 7 గంటలకు ప్రారంభమైంది.. సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ ప్రక్రియ కొనసాగనుంది.. కొవిడ్ నిబంధనలు పాటిస్తూ పోలింగ్ కేంద్రాల వద్ద ఏర్పాట్లు చేశారు.. ఓటర్లు బౌతిక దూరం పాటించే విధంగా క్యూ లైన్ల లో మార్కింగ్ చేశారు. కాగా, ఉదయాన్నే పోలింగ్ కేంద్రాల వద్ద ఓటర్లు బారులు తీరారు. ఉదయం ఏడు గంటలకు పోలింగ్ ప్రక్రియ ప్రారంభమైంది. పోలింగ్ కేంద్రాలను ఎప్పటికప్పుడు అధికారులు పరిశీలిస్తున్నారు. మొత్తం 2,214 డివిజన్, వార్డు స్థానాల్లో 580 ఏకగ్రీవం కాగా మిగతా వాటికి పోలింగ్ జరుగుతున్నది.. అలాగే, నాలుగు మునిసిపాలిటీలు ఏకగ్రీవం కాగా, మిగిలిన 71 మునిసిపాలిటీలు, 12 నగర పాలక సంస్థల్లో పోలింగ్ జరుగుతోంది. బరిలో 7,549 మంది అభ్యర్థులు ఉండగా, 77,73,231 మంది తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. ఇది ఇలా ఉంటే విజయవాడలోని పోలింగ్ సరళిని రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ కృష్ణా జిల్లా కలెక్టర్ ఇంతియాజ్ తో కలసి పరిశీలించారు….
Advertisement
తాజా వార్తలు
Advertisement