Thursday, November 21, 2024

ఎపిలో తొలి రెండు గంట‌ల‌లో 13.23 శాతం పోలింగ్…

అమ‌రావ‌తి – ఎపిలో మునిసిప‌ల్ ఎన్నిక‌ల పోలింగ్ స్వ‌ల్ప సంఘ‌ట‌న‌లు మిన‌హా ప్ర‌శాంతంగా కొన‌సాగుతున్న‌ది… మంద‌కొడిగా ప్రారంభ‌మైన పోలింగ్ క్ర‌మ క్ర‌మంగా ఊపందుకుంటున్న‌ది.. మొత్త 12 న‌గ‌ర పాల‌క సంస్థ‌ల‌కు, 71పుర‌పాల‌క సంఘాల‌కు జ‌రుగుతున్న పోలింగ్ ప్ర‌క్రియ సాయంత్రం 5 గంట‌ల‌కు ముగియ‌నుంది.. కాగా,  కృష్ణా జిల్లా మచిలీపట్నంలో పేర్ని నాని, విశాఖ జిల్లా భీమిలి నేరెళ్లవలసలో అవంతి శ్రీనివాస్‌, వైఎస్సార్‌ జిల్లా కడప 29వ డివిజన్‌లో డిప్యూటీ సీఎం అంజాద్ బాషా, విజయవాడ పశ్చిమ నియోజకవర్గం 53వ డివిజన్‌లో వెల్లంపల్లి శ్రీనివాస్‌, ప్రకాశం జిల్లా ఒంగోలు 34వ డివిజన్‌లో బాలినేని శ్రీనివాస్‌రెడ్డి, పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరు 25వ డివిజన్‌లో ఆళ్ల నాని.. తమ ఓటు హక్కులను వినియోగించుకున్నారు. ఇది ఇలా ఉంటే  రాష్ట్ర వ్యాప్తంగా ఉదయం 9 గంటల వరకు 13.23 శాతం పోలింగ్ నమోదైంది. ఉదయం 9 గంటల వరకు జిల్లాల వారీగా పోలింగ్‌ శాతం ఇలా ఉంది.
కృష్ణా జిల్లా- 13 శాతం
చిత్తూరు-9 శాతం
ప్రకాశం-14 శాతం,
వైఎస్సార్‌ జిల్లా- 8 శాతం
నెల్లూరు జిల్లా 12 శాతం
విశాఖ జిల్లా- 14 శాతం
కర్నూలు జిల్లా- 11 శాతం
గుంటూరు జిల్లా 16 శాతం
శ్రీకాకుళం 10 శాతం
తూర్పుగోదావరి- 16 శాతం
పశ్చిమగోదావరి-16 శాతం
అనంతపురం-12 శాతం
విజయనగరం-14 శాతం

Advertisement

తాజా వార్తలు

Advertisement