అమరావతి – అమరావతి రాజధాని భూముల అక్రమాలపై టీడీపీ అధినేత చంద్రబాబుకు ఏపీ సీఐడీ నోటీసులు జారీ చేసింది. హైదరాబాద్‌లోని చంద్రబాబు నివాసానికి చేరుకున్న అధికారులు నోటీసులు ఇచ్చారు. 41 సీఆర్‌పీసీ కింద నోటీసులు ఇచ్చామని సీఐడీ చీఫ్ సునీల్ కుమార్ తెలిపారు. ఈ నెల 23వ తేదీన విచారణకు హాజరుకావాల్సిందిగా నోటీసుల్లో కోరారు. కాగా నేటి ఉదయం హైదరాబాద్ లోని చంద్రబాబు నివాసానికి అరుగురు సిఐడి అధికారులు చేరుకున్నారు.. ఆ తర్వాత సెక్యూరిటీ సిబ్బందితో మాట్లాడి లోపలికి వెళ్లారు. ఆ తర్వాత చంద్రబాబు నాయుడిని కలసి స్వయంగా ఆయనకు నోటీసులు అందజేశారు.. నోటీసులో ఇచ్చిన తేదిలో విచారణకు హాజరు కావలసిందిగా అధికారులు కోరారు.. కాగా, చంద్రబాబు క్యాబినేట్ లో పని చేసిన మరో మంత్రి నారాయణకు కూడా ఇదే విధమైన నోటీసులు అందజేవారు.. అమరావతిలోనే రాజధాని అంటూ ముందుగానే చంద్రబాబు తన అనుచరులకు సమాచారం ఇచ్చి అక్కడి అసైన్డ్ భూములు కొనుగోలు చేయించారని అభియోగాలపై కేసు నమోదు చేసినట్లు సమాచారం..
Advertisement
తాజా వార్తలు
Advertisement