Thursday, October 24, 2024

రైతులు సాగునీటికి ఇబ్బందులు పడకుండా చూస్తాం

పెదకూరపాడు . మిర్చి రైతులు సాగునీటికి ఇబ్బందులు పడకుండా చూస్తామని పెదకూరపాడు శాసనసభ్యులు నంబూరు శంకరరావు అన్నారు.పెదకూరపాడు నియోజకవర్గంలో సాగునీరుకు సంభందించి అమరావతి మేజర్ కాలువలో నీటిని శనివారం పరిశీలించి మెయిన్ బ్రాంచ్ కెనాల్ వద్ద అధికారులతో సమీక్ష నిర్వహించారు. సాగునీటిని ఈనెల 15 వరకు మాత్రమే విడుదల చేస్తామని ఎన్ ఎస్ కెనాల్స్ అధికారులు తెలపటంతో సంభందిత రాష్ట్ర మంత్రి అనిల్ కుమార్తో ఫోన్లో మాట్లాడి అదనంగా మరో నాలుగు రోజులు పాటు నీటిని విడుదల చేయాలని,రైతులు నీటి కోసం ఇబ్బందులు పడుతున్నారనే ఈ విషయాన్ని తెలపడంతో మంత్రి సానుకూలంగా స్పందించారని ఆయన వివరించారు. అమరావతి మేజర్ కాలువలో నాసు,తూటీకాడ, వ్యర్ధాలు ఉండడంతో పార్టీ నేతలు బుజ్జి, కార్యకర్తల సహాయముతో 3 ఎక్స్ వెయిటర్ల ద్వారా నాచు, తూటీ కాడ, వ్యర్థాల తొలగింపు జరుగుతుందని 350 క్యూసెక్కుల నీటి నుండి 400 క్యూసెక్కుల నీరు అమరావతి మేజర్ కాలువకు వస్తుందని తెలిపారు. వేసవికాలంలో అమరావతి మేజర్ కాలువలు రిపేరు చేయించి ప్రతి సంవత్సరం రైతులు ఇబ్బంది పడకుండా సాగునీరు అందించేలా చూస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో జిడిసీసీ బ్యాంక్ మాజీ డైరెక్టర్ నెలకుదుటి వీర వెంకట శేఖర వరప్రసాద్(బుజ్జి), హుస్సేన్ నగరం సర్పంచ్ మాగులూరి అనిల్ కుమార్ , జిల్లా కార్యదర్శి ఈదా సాంబిరెడ్డి, 75-త్యాల్లురు వ్యవసాయ సహకార పరపతి సంఘం మాజీ అధ్యక్షులు వట్టికూటి శివరామకృష్ణయ్య , వైసీపీ నాయకులు దండా నాగేంద్ర, బత్తుల రాజేంద్ర, సంబంధిత శాఖ అధికారులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement