Friday, December 27, 2024

ఓడినా ఆహంభావం చంద్ర‌బాబులో త‌గ్గ‌లేదు – స‌జ్జ‌ల‌…

అమ‌రావ‌తి: ఎన్నికల్లో టీడీపీ ఓటమితో చంద్రబాబు ఆసహనంలో మాట్లాడుతున్నారని, చంద్రబాబు ఉక్రోశం, ఆక్రోశం ఏంటో ఆర్థం కావడం లేదు ఎద్దేవా చేశారు ఎపి ప్ర‌భుత్వ స‌ల‌హాదారు సజ్జ‌ల రామ‌కృష్ణారెడ్డి.. తాడేప‌ల్లి వైసిపి కేంద్ర కార్యాల‌యంలో ఆయ‌న మీడియాతో మాట్లాడుతూ, మామను వెన్నుపోటు పొడిచి చంద్రబాబు అధికారంలోకి వచ్చారని మండిపడ్డారు. ప్ర‌జ‌లు చిత్తుగా ఓడించినా చంద్రబాబుకు ఇంకా అహంభావం తగ్గలేదని అన్నారు. ఎన్నిక‌ల ప్ర‌చారంలో ఓట్లు ఆడ‌గ‌కుండా ప్రజలను బాబు ఘోరంగా అవమానిస్తున్నారని దుయ్యబట్టారు. రాబోయే దశాబ్ధం పాటు వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డినే ముఖ్యమంత్రిగా ఉండాలని ప్రజలు ఆకాంక్షిస్తున్నారని పేర్కొన్నారు. పేదల జీవన ప్రమాణాలు పెంచే విధంగా ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌ పాలన సాగుతోందని చెప్పారు. ఎన్నికల్లో టీడీపీ ఓటమి కారణంగానే చంద్రబాబు ఫ్రస్టేషన్‌లో మాట్లాడుతున్నారని విమర్శించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement