Friday, October 18, 2024

Guntur – హెల్థీ ఇండియా – హ్యాపీ ఇండియా – కేంద్ర‌మంత్రి పెమ్మ‌సాని

ఎలక్ట్రానిక్ గాడ్జెట్స్ వదిలి ఆరోగ్యంపై శ్రద్ధ వహించాలి
ఈ కార్యక్రమ నిర్వహణతో ఏపీ సర్కిల్ ముందంజలో ఉంది
ఇండియా పోస్ట్ రన్ – 20 24 కార్యక్రమంలో
కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని

ఉమ్మడి గుంటూరు బ్యూరో,: ఆంధ్రప్రభ: ముఖ్యమంత్రి చంద్రబాబుని చూస్తే గర్వంగా ఉంటుంది. ఆరోగ్యం పట్ల ఆయన తీసుకునే శ్రద్ధ యువతకు పోటీపడే ఏకైక వ్యక్తిగా అనిపిస్తుంది. దేశంలో ఎన్నో పోస్ట్ ఆఫీస్ లు, సర్కిళ్ళు ఉన్నాయి. కానీ ఏపీ సర్కిల్ మాత్రమే ఈ ఇండియా పోస్ట్ రన్ – 20 24 కార్యక్రమం నిర్వహించడం ఆనందంగా ఉంది. అన్నింటిలో తాము ముందు ఉంటామని పోస్టల్ డిపార్ట్మెంట్ మరోసారి నిరూపించిందని కేంద్ర గ్రామీణ అభివృద్ధి, కమ్యూనికేషన్స్ శాఖ కేంద్ర సహాయ మంత్రి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ అన్నారు.

ఇండియా పోస్ట్ రన్ – 2024 కార్యక్రమాన్ని
గుంటూరులోని స్థానిక లాడ్జ్ సెంటర్లో ఆదివారం ఉదయం పోస్టల్ శాఖ నిర్వహించింది. ఈ కార్యక్రమంలో మహిళలు, పురుషులకు 10 కే, 5 కే, 3 కే రన్ ను కేటగిరీల వారీగా అధికారులు ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి విశిష్ట అతిథిగా విచ్చేసిన పెమ్మసాని కార్యక్రమంలో ముందుగా ప్రజా సమక్షంలో ‘స్పెషల్ పోస్టల్ కవర్’ ను ఆవిష్కరించారు. అనంతరం పోస్టల్ రన్ లో ప్రథమ, ద్వితీయ, తృతీయ స్థానాలను దక్కించుకున్న విజేతలకు బహుమతులను అందజేశారు.

అనంతరం ఆయన మాట్లాడుతూ ఫిట్ నెస్ పై ప్రతి ఒక్కరికి అవగాహన కలిగి ఉండాలని, ఇతరులు చూసి స్ఫూర్తి పొందాలని కోరారు. ‘నేటి సమాజంలో పిల్లలు, పెద్దలు అందరూ టీవీలు, సెల్ ఫోన్లకు అతుక్కు పోయి రోజులో 4-5 గంటల సమయాన్ని వృథా చేసుకుంటున్నారు. ఇలాంటి పోస్టల్ రన్ కార్యక్రమాలు జరిగినప్పుడైనా అందరిలోనూ స్ఫూర్తి కలగాలి. జీవితంలో ఎంత బిజీగా ఉన్నా సరే ఆరోగ్యానికి ముఖ్యపాత్ర ఇవ్వాలని మర్చిపోకూడదని తెలిపారు.

ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేలు మొహమ్మద్ నసీర్ అహ్మద్, భాష్యం ప్రవీణ్ కుమార్, జిఎంసి కమిషనర్ పులి శ్రీనివాసులు, గుంటూరు జిల్లా జనసేన అధ్యక్షులు గాదె వెంకటేశ్వరరావు, జనసేన పశ్చిమ నియోజకవర్గ ఇన్చార్జ్ బోనబోయిన శ్రీనివాస్ యాదవ్, క్రిస్టియన్ మైనార్టీ సెల్ మాజీ చైర్మన్ మద్దిరాల మ్యాని తదితరులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement