అక్కడే నివాసం..జనసేనానికి కార్యకలాపాలు
అతిథి గృహన్ని పరిశీలించిన పవన్
కొన్నిమార్పులు సూచించిన జనసేనాని
ఇరిగేషన్ శాఖ అధికారులతో మాట మంతి
డిప్యూటీ సిఎం హోదాలో అమరావతికి పవన్
ఘనంగా స్వాగతం పలికిన రైతులు
ఉప ముఖ్యమంత్రి పవన్‌కల్యాణ్ క్యాంప్ కార్యాలయంగా ఇరిగేషన్ గెస్ట్హౌ్స్ ను ప్రభుత్వం కేటాయించింది. విజయవాడలోని సూర్యారావుపేటలో ఉన్న ఇరిగేషన్ గెస్ట్‌హౌ్‌సను గతంలో చంద్రబాబు ప్రభుత్వంలో దేవినేని ఉమా జలవనరుల మంత్రిగా ఉన్నప్పుడు విశాలంగా నిర్మించారు.. ఆ తర్వాత దానిని బొత్సకు కేటాయించారు.. ఆ అతిథి గృహన్ని తాజాగా పవన్ కోసం కేటాయించారు.. ఈ నేపథ్యంలోనే పవన్ కల్యాణ్ విజయవాడలోని నీటిపారుదలశాఖ అతిథిగృహాన్ని పరిశీలించారు.. ఆర్ట్ డైరెక్టర్ ఆనంద్ సాయితో కలిసి పరిశీలించిన పవన్ కల్యాణ్ కొన్ని మార్పులు సూచించారు.. ఇక ఇదే భవనంలో అంతస్తులో నివాసం.. కింది అంతస్తులో కార్యాలయం ఏర్పాటు చేయనున్నారు.. అలాగే విశాలమైన కాన్ఫ్ రెన్స్ హాలు ఉండటంతో పవన్ అక్కడే ఉండేందుకు అంగీకారం తెలిపారు.. దీంతో పవన్ కోరిన విధంగా మార్పులు చేయనున్నారు..
కాగా పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖల అధికారులు పవన్ ను కలిశారు.. తొలిసారిగా క్యాంప్ కార్యాలయానికి వచ్చిన ఆయనను సాదరపూర్వకంగా ఆహ్వానించారు సిబ్బంది.. వారందర్ని పవన్ అప్యాయంగా పలకరించారు..
పవన్ కు విమానాశ్రయంలో ఘన స్వాగతం
కాగా, పవన్ కల్యాణ్ విజయవాడకు నేటి ఉదయం చేరుకున్నారు. హైదరాబాద్ నుంచి ప్రత్యేక విమానంలో వచ్చిన ఆయనకు గన్నవరం ఎయిర్‌పోర్టులో జనసేన నాయకులు, అభిమానులు ఘన స్వాగతం పలికారు. ఇది ఇలా ఉంటే . మంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన తర్వాత మొదటిసారి సచివాలయానికి వచ్చారు… రెండో బ్లాక్‌లోని తనకు కేటాయించిన ఛాంబర్‌ను పరిశీలించారు. ఇక ఉప ముఖ్యమంత్రిగా బుధవారం తన ఛాంబర్లో బాధ్యతలు తీసుకోనున్నారు. ఇక ఉప ముఖ్యమంత్రి హోదాతో తొలిసారి ఆమరావతి వచ్చిన ఆయనకు రైతులు ఆయనకు ఘన స్వాగతం పలికారు.