Sunday, November 24, 2024

రైస్ మిల్లర్ కిడ్నాప్ కథ సుఖాంతం…

గూడూరు( కర్నూలు జిల్లా) – కర్నూలు జిల్లా, గూడూరుకు చెందిన రైస్ మిల్లర్ వెంకటేశ్వరులు కిడ్నాప్ కేసును పోలీసులు చేదించారు. ముగ్గురు నిందితుల్లో ఒకరిని అదుపులోకి తీసుకున్నారు. మరో ఇద్దరు పరారులో ఉన్నారు.

వివరాల్లోకి వెళితే గూడూరుకు చెందిన వెంకటేశ్వర్లు సోమవారం రాత్రి తన రైస్ మిల్లు వద్ద ఉండగా ముగ్గురు వ్యక్తులు సుమో వాహనంలో వచ్చి అతని కిడ్నాప్ చేశారు. ఆ తర్వాత రూ. 3 కోట్లు ఇవ్వాలని వెంకటేశ్వర్లు కుటుంబ సభ్యులను డిమాండ్ చేశారు. ఈ సమాచారం అందుకునే రంగంలోకి దిగిన పోలీసులు కిడ్నాపర్ల కోసం గాలింపు చేపట్టారు. సంఘటనలు జరిగి 24 గంటలు కాకమునుపే ఎట్టకేలకు కిడ్నాపర్లను గుర్తించారు. వారి చేర నుంచివెంకటేశ్వర్లును విడిపించారు.

- Advertisement -

పోలీసులు వెల్లడించిన వరకు కిడ్నాపర్లు గూడూరు మండలం పొన్నకల్లు గ్రామానికి చెందిన కొండయ్య ,కోడుమూరు మండలం పులకుర్తి గ్రామానికి చెందిన గొల్ల వీరేష్, కర్నూలు చెందిన మున్నా భాష గా గుర్తించారు. అంతేకాదు కిడ్నాపర్లలో ఒకరైన పొన్నకల్ కొండయ్య ను పోలీసుల అదుపులో తీసుకున్నారు. ఈ కేసులో మరో ఇద్దరు పరారీలో ఉన్నట్లు పోలీసులు వెల్లడించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement