ఆంధ్రప్రదేశ్లోని తిరుపతి జిల్లాలో ఘోరం జరిగింది. గూడూరు నిమ్మకాయల మార్కెట్లో ఓ మహిళ దారుణ హత్యకు గురయ్యింది. తొలుత గుర్తుతెలియని దుండగులు మహిళను కత్తితో నరికి పరారైనట్టు అంతా భావించారు. దీంతో ఒక్కసారిగా గూడూరు నిమ్మ మార్కెట్లో ఆందోళన నెలకొంది. అయితే.. ఈ ఘాతుకానికి పాల్పడ్డది ఆ మహిళ భర్తే అని తెలిసి అంతా విస్మయానికి గురయ్యారు.
వ్యక్తిగత వివాదమా, కక్ష్యతోనే ఆ మహిలను చంపేశారా అనుకున్న వాళ్లకు భర్తే చంపేశాడన్న వార్త తెలిసి భయాందోళనకు గురయ్యారు. వెంకటలక్ష్మి అనే మహిళను తన భర్త శేఖరే కత్తితో పీక కోసి దారుణంగా చంపేశాడని స్థానికుల ద్వారా తెలుస్తోంది. ఈ మేరకు ఘటనా స్థలాన్ని పోలీసుల పరిశీలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు గూడూరు పోలీసులు తెలిపారు.