Thursday, September 12, 2024

Gudlavalleru – విద్యాల‌యాల‌లోనూ భ‌యం భయం బతుకే – ష‌ర్మిల

అమ‌రావ‌తి – గుడ్లవల్లేరు ఇంజనీరింగ్ కాలేజీ అమానవీయ ఘటనపై వెంటనే చర్యలు తీసుకోవాలని ఏపీ కాంగ్రెస్‌ అధ్యక్షురాలు వైఎస్‌ షర్మిల డిమాండ్‌ చేశారు. ఒక ఆడబిడ్డ తల్లిగా ఈ ఘటన నన్ను తీవ్ర భయాందోళనకు గురిచేసిందని తెలిపారు. చదువు, సంస్కారం నేర్పాల్సిన విద్యాసంస్థలు.. పిల్లలకు ఏం నేర్పుతున్నాయోనన్న ఆలోచనలో పడేసిందని అన్నారు. ఉన్నత చదువుల కోసం ఆడపిల్లలను కాలేజీలకు పంపితే… వారి మాన ప్రాణాలకు రక్షణ లేదనడానికి ఈ ఘటనే మరో నిదర్శనమని వైఎస్‌ షర్మిల పేర్కొన్నారు. ఈ మేరకు ఆమె నేడు ఒక ప్రకటన విడుదల చేశారు..

కాలేజిల్లో పర్యవేక్షణ కొరవడిందనడానికి ఇదే సజీవ సాక్ష్యమని అన్నారు. యాజమాన్యాల నిర్లక్ష్యానికి నిలవెత్తు దర్పణమని అన్నారు. కాసుల కక్కుర్తి తప్పా.. భద్రత ప్రమాణాలు గాలికొదిలేశారనే దానికి ఈ ఘటనే ఉదాహరణ అని మండిపడ్డారు. ఈ ఘటనపై సాధారణ విచారణ కాదు. ఫాస్ట్రాక్ విచారణ జరగాలని అభిప్రాయపడ్డారు. తక్షణమే ఉన్నత స్థాయి కమిటీ వేసి సీనియర్ ఐపీఎస్ అధికారులతో విచారణ జరిపించాలని డిమాండ్‌ చేశారు.

బాత్ రూముల్లో కెమెరాలు పెట్టింది ఎవరో వెంటనే తేల్చాలని షర్మిల అన్నారు. రాజకీయ నాయకుడి కొడుకా.. కూతురా కాదు.. కెమెరాలు పెట్టింది ఎవరైనా.. ఎంతటి వారైనా కఠినంగా శిక్షించాల్సిందేనని డిమాండ్‌ చేశారు. మరోసారి ఇలాంటి అఘాయిత్యానికి ఒడిగట్టాలంటే భయపడేలా చర్యలు ఉండాల్సిందేనని అన్నారు. బాత్ రూముల్లో రికార్డ్ అయిన ఏ వీడియో కూడా పబ్లిక్ కాకుండా చూడాలని పోలీస్ శాఖకు విజ్ఞప్తి చేశారు. వచ్చేవారం లోపు చర్యలు చేపట్టకపోతే కాలేజీని సందర్శించి.. విద్యార్థినులతో మాట్లాడుతానని తెలిపారు. వారు కోరుకున్నట్లు న్యాయం జరిగే వరకు వారి పక్షాన పోరాటం చేస్తామని కాంగ్రెస్ పార్టీ తరఫున హామీ ఇచ్చారు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement