Friday, September 20, 2024

Gudlavalleru – విద్యార్ధినులకు ఊర‌ట‌… నో కెమెరా … నో రికార్డింగ్… ఎస్పీ ప్ర‌క‌ట‌న

గుడ్లవల్లేరు ఇంజినీరింగ్‌ కళాశాల విద్యార్ధినుల‌కు ఊర‌ట ల‌భించింది.. హ‌స్ట‌ల్ వాష్ రూంలో ర‌హ‌స్య కెమెరాతో వీడియోలు తీశార‌నే ఆరోప‌ణ‌లో గ‌త రాత్రి నుంచి విద్యార్ధినులు ఆందోళ‌న బాట ప‌ట్టారు.. దీనిపై రంగంలోకి దిగిన పోలీసులు విచార‌ణ చేప‌ట్టారు.. ఆరోపిత నిందితుడు ల్యాప్ ట్యాప్, సెల్ ఫోన్ లు సీజ్ చేశారు.. అత‌డిని పోలీసుల అదుపులోకి తీసుకున్నారు.. అలాగే వాష్ రూంల‌లో కెమెరాలు గురించి అణువ‌ణువు గాలించారు..

అయితే అక్క‌డ ఎటువంటికెమెరాలు ఉన్న ఆన‌వాళ్లు క‌నిపించ‌లేదు.. అలాగే నిందితుడి ల్యాప్ టాప్ , సెల్ ఫోన్ ల‌ను సైబ‌ర్ నిపుణులు విద్యార్ధినులు కాలేజీ స్టాఫ్ ఎదురుగా పరిశీలించారు . ఎటువంటి కెమెరా లింక్ లు గాని , బాత్ రూం వీడియోలు గాని లేవ‌ని నిర్ధారించారు.. దీంతో కృష్ణా జిల్లా ఎస్సీ గంగాధ‌ర‌రావు ఒక ప్ర‌క‌టన విడుద‌ల చే్స్తూ, అమ్మాయిలు ఈ సమస్య గురించి ఆందోళన చెందాల్సిన అవసరం లేద‌న్నారు.. అయిన‌ప్ప‌టికీ ఈ వార్త‌ను ట్రోలింగ్ చేసిన వారిపై దృష్టిపెడుతున్నామ‌ని చెప్పారు.. ఈ నేరంలో తప్పు చేసిన వారిని గుర్తించి వారి పైన కఠిన చర్యలు తీసుకుంటామ‌ని చెప్పారు…

- Advertisement -

విచార‌ణ‌కు ముఖ్య‌మంత్రి ఆదేశం

అంత‌కు ముందు హిడెన్ కెమేరాలు ఉన్నాయనే అంశంపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు విచారణకు ఆదేశించారు. హాస్టల్ లో రహస్య కెమేరాలు ఉన్నాయనే విద్యార్థినుల ఆందోళనపై విచారణ జరపాలని కోరారు. తక్షణమే జిల్లా మంత్రి కొల్లు రవీంద్రతో పాటు జిల్లా కలెక్టర్, ఎస్పీ లను ఘటనా స్థలానికి వెళ్లాలని ముఖ్యమంత్రి ఆదేశించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement