Friday, November 22, 2024

Gudiwada – కొడాలి నాని నామినేషన్‌పై వివాదం – గుడివాడలోటెన్షన్ టెన్షన్

( గుడివాడ, ప్రభన్యూస్) : కృష్ణాజిల్లా గుడివాడలో ఉద్రిక్త ప‌రిస్థితులు నెల‌కొన్నాయి. గుడివాడ అసెంబ్లీ నియోజకవర్గ వైసీపీ అభ్యర్థి, మాజీ మంత్రి కొడాలి నాని నామినేషన్‌పై వివాదం ఏర్ప‌డింది. నామినేష‌న్ లో త‌ప్పుడు స‌మాచారం చేర్చారంటూ ఉరిటర్నింగ్‌ అధికారి (ఆర్వో) పెండ్యాల పద్మావతికి టీడీపీ నేతలు ఫిర్యాదు చేశారు. స్థానిక పాత మున్సిపల్‌ కార్యాలయాన్ని క్యాంపు కార్యాలయంగా వినియోగించినట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు. కాగా పాత మున్సిపల్ కార్యాలయ భవనాన్ని అద్దెకిచ్చినట్లు అధికారులు పేర్కొన్న పత్రాలను దీనికి జత చేశారు. దీంతో తప్పుడు సమాచారమిచ్చిన కొడాలి నాని నామినేషన్‌ను తిరస్కరించాలని కోరారు. ఏ ప్రభుత్వ కార్యాలయాన్నీ వినియోగించలేదని కొడాలి నాని తన అఫిడవిట్‌లో పేర్కొన్న నేపథ్యంలో ఆధారాలతో టీడీపీ ఫిర్యాదు చేసింది.

వైసీపీకి తొత్తులా అధికారి..?
రిటర్నింగ్ అధికారి వైసీపీకి తొత్తులా వ్యవహరిస్తున్నారని దీనిపై ఎన్నికల కమిషన్ కు సైతం ఫిర్యాదు చేయనున్నట్లు టీడీపీ మాజీ ఎమ్మెల్యే రావి వెంకటేశ్వరరావు పేర్కొన్నారు. అంతేకాక ఎమ్మెల్యే కొడాలి నానిపై ఐదు పోలీసు కేసులు ఉన్నా దానికి సంబంధించి కూడా తప్పుడు సమాచారం అందించారని టీడీపీ నేతలు ఆరోపించారు. ఈ విషయంపై ఎన్నికల అఫిడవిట్​లో ఏదైనా ప్రభుత్వ కార్యాలయాన్ని వాడుకున్నారా లేదా అనే ఆప్షన్ లో ఎస్ అంటే రెంటు ఎవరు కట్టారు..? తదితర వివరాలను పొందుపర్చాలి. కానీ అందులో నో అని నమోదు చేశారు.

- Advertisement -

కానీ గతంలో సదరు ప్రభుత్వ భవనాన్ని మంత్రి కార్యాలయంగా వాడినందున దానికి సంబంధించిన అద్దె బకాయిలను సివిల్ సప్లై శాఖ ద్వారా చెల్లింపులు జరిపినట్టు మున్సిపల్ కమిషనర్ రాతపూర్వకంగా ఇచ్చిన కాపీని టీడీపీ నేతలు తమ ఫిర్యాదుతో జతపరిచారు. ఈ విషయంపై హైకోర్టుకు వెళ్లే అవకాశం ఉన్నా.. ఈరోజు నామినేషన్ల వెరిఫికేషన్ కారణంగా ఇటువంటి అభ్యంతరకరమైన నామినేషన్లను తిరస్కరించే అవకాశం ఉన్నందున ఆర్వో తీసుకునే నిర్ణయం కోసం ఎదురుచూస్తున్నట్లు టీడీపీ నేతలు వాదిస్తున్నారు. ఇక్కడ న్యాయం జరగని పక్షంలో న్యాయస్థానాలను ఆశ్రయించడానికి సిద్ధంగా ఉన్నట్లు తెలిపారు. కాగాఈ విషయంపై రిటర్నింగ్‌ అధికారి ఎలాంటి నిర్ణయం తీసుకుంటారనే దానిపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement