Saturday, November 23, 2024

ఏపీలో చిన్నారులకు మెరుగైన వైద్యం… ప్రణాళిక సిద్ధం

ఏపీలో థర్డ్ వేవ్ హెచ్చరిక నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం నివారణకు ముందస్తు ప్రణాళిక సిద్ధం చేస్తోంది. చిన్నారులకు మెరుగైన వైద్యం కోసం పీడియాట్రిక్ అంశాల్లో వైద్య సిబ్బందికి శిక్షణ ఇవ్వడం కోసం ప్రత్యేకంగా ఏర్పాట్లు చేసింది. మంగళగిరి ఏపిఐఐసి భవనం 6ఫ్లోర్ లోని కాన్ఫరెన్స్ హల్ లో మంగళవారం కోవిడ్ నివారణ గ్రూప్ అఫ్ మిమిస్టర్స్ సమావేశం రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి, కమిటీ కన్వీనర్ ఆళ్ల నాని అధ్యక్షతన జరిగింది. సబ్ కమిటీ సభ్యులైన మంత్రులు బొత్స సత్యనారాయణ, బుగ్గన రాజేంద్ర నాధ్ రెడ్డి, కురసాల కన్నబాబు, రాష్ట్ర ప్రభుత్వం సలహాదారులు సజ్జల రామకృష్ణ రెడ్డి, డాక్టర్ సిదిరి అప్పలరాజు, పలువురు వైద్య ఆరోగ్య శాఖ ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

సీఎం జగన్ ఆదేశాల మేరకు జనావాసాలకు దగ్గరిగా ఉండేలా హెల్త్ హాబ్ లు ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ప్రభుత్వ హాస్పిటల్స్ లో చిన్నారులకు వైద్య చికిత్స సదుపాయం కల్పించడానికి చర్యలు తీసుకోవాలని తెలిపారు. ఆరోగ్య శ్రీ అత్యుత్తమ ఆరోగ్య పధకంగా నిలవాలని సీఎం సంకల్పం అని మంత్రులు తెలిపారు. వ్యాక్సిన్ మరింతగా వేగవంతం చేయాలని 5 సంవత్సరాల లోపు తల్లులకు టీకా వేసే కార్యక్రమం ముమ్మరం చేయాలన్నారు. ఆరోగ్య శ్రీ పధకం ద్వారా అందిస్తున్న వైద్య సేవలు పూర్తిగా ఉచితం అని, థర్డ్ వేవ్ నేపథ్యంలో ఎలాంటి పరిస్థితులు ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండాలని వైద్య ఆరోగ్య శాఖ అధికారులకు ఆదేశించారు. ప్రాధమిక ఆరోగ్య కేంద్రాలు, ఏరియా హాస్పిటల్స్ ముందుగానే పరిశీలించి అవకాశం ఉన్న చోట పిల్లలకు చికిత్స అందించడానికి ఏర్పాట్లు చేయాలన్నారు.

థర్డ్ వేవ్ లో అవసరమైన అన్ని రకాలు మందులు అందుబాటులో ఉంచుకోవాలని సూచించారు. అర్హులైన తల్లులకు ఒక రోజు ముందుగానే వ్యాక్సిన్ టోకెన్స్ పంపిణికి ఏర్పాట్లు చేయాలని నిర్ణయించారు. బ్లాక్ ఫంగస్ వ్యాధి సోకిన వారికి అన్ని హాస్పిటల్స్ లో మెరుగైన వైద్యం అందించడానికి ప్రత్యేకంగా దృష్టి పెట్టాలన్నారు. ఇంజక్షన్స్ బ్లాక్ మార్కెట్ లో విక్రయాలు జరిగితే కఠినంగా వ్యవహారించాలని స్పష్టం చేశారు. కరోనా కేసులు తగ్గు ముఖం పట్టిన అప్రమత్తంగా ఉండాలని కమిటీ సూచించింది. ఇప్పటివరకు రాష్ట్ర వ్యాప్తంగా 2 వేలకు పైబడి బ్లాక్ ఫంగస్ కేసులు నమోదు అయ్యాయి. చిన్న పిల్లలుకు వైద్యం అందించడానికి అదనంగా వైద్యులు, సిబ్బంది నియామకానికి చర్యలు తీసుకోవాలని ఆదేశించింది. అన్ని హాస్పిటల్స్ లో బెడ్స్ అందుబాటులో ఉంచాలని కమటి నిర్ణయించింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement