ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ గ్రూప్ 1 ప్రిలిమ్స్ పరీక్ష ఫలితాలు ఇవాళ విడుదలయ్యాయి. ఈ మేరకు కమిషన్ అధికారిక వెబ్ సైట్ లో ఎంపికైన అభ్యర్ధుల జాబితాలు ఉంచారు.
రాష్ట్రంలో వివిధ కేటగిరీల్లో ఖాళీగా ఉన్న 81 పోస్టుల భర్తీ కోసం గత ఏడాది డిసెంబర్లో ఏపీపీఎస్సీ గ్రూప్ 1 నోటిఫికేషన్ విడుదల చేసింది. దీని ప్రకారం ఈ ఏడాది మార్చి 17న గ్రూప్ 1 ప్రిలిమ్స్ పరీక్ష నిర్వహించింది. ఈ పరీక్షకు దాదాపు లక్షన్నర మంది దరఖాస్తు చేసుకున్నారు. వీరిలో లక్షకు పైగా పరీక్ష రాశారు. గ్రూప్ 1 ప్రిలిమ్స్ పేపర్ 1, పేపర్ 2 పరీక్షలు రాసిన వారిలో 567 మంది అభ్యర్ధుల్ని తిరస్కరించారు. అలాగే 4496 మందిని మెయిన్స్ పరీక్ష కోసం ఎంపిక చేశారు. ఈ మేరకు రెండు వేర్వేరు జాబితాలను ఏపీపీఎస్సీ విడుదల చేసింది.
ఈ ఏడాది సెప్టెంబర్ 2 నుంచి సెప్టెంబర్ 7వ తేదీ వరకూ గ్రూప్ 1 మెయిన్స్ పరీక్షల్ని ఏపీపీఎస్సీ నిర్వహించాల్సి ఉంది. అంటే దాదాపు ఐదు నెలల వ్యవధి లభించింది. దీంతో అభ్యర్ధులు సీరియస్ గా ప్రిపేర్ అయ్యేందుకు అవకాశం ఉంది. . కాబట్టి అభ్యర్ధులు ఇందులో తమ హాల్ టికెట్ నంబర్ ఆధారంగా ఫలితాలు తెలుసుకోవచ్చు.