కర్నూలు, ప్రభన్యూస్ : వైద్యారోగ్యశాఖలో సాధారణ బదిలీలకు ముఖ్యమంత్రి వై.ఎస్ జగన్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. అమరావతిలో వైద్య ఆరోగ్య శాఖతో నిర్వహించిన సమీక్షా సమావేశంలో ఆయన ఈ నిర్ణయం తీసుకున్నారు. ముఖ్యంగా వచ్చే ఏడాది ఫిబ్రవరి నాటికి ప్రతి ఆస్పత్రిలో ఉండాల్సిన సంఖ్యలో సిబ్బంది ఉండేలా చర్యలు చేపట్టాలని వైద్య ఆరోగ్య శాఖ ఉన్నత స్థాయి అధికారులకు సూచించారు. అప్పటిలోపు కొత్త రిక్రూట్‌మెంట్‌ను పూర్తి చేయాలని ఆదేశించారు.
సాధారణ బదిలీలు కోసం కర్నూలు ప్రభుత్వాస్పత్రితో పాటు నంద్యాల, ఆదోని ప్రభుత్వ ఆస్పత్రిలో పనిచేసే ఎంతో మంది వైద్యులు ఎదురుచూస్తున్నారు. 3 నెలల క్రితం డిప్యుటేషన్లను ప్రభుత్వం నిలిపివేయడంతో వారికి అవకాశం లేకుండా పోయింది. దీంతో చాలామంది వైద్యులు తమ కుటుంబ సభ్యులకు దూరంగా ఉండటం, అనారోగ్య సమస్యలు వెంటాడటం వల్ల మానసికంగా ఇబ్బంది పడుతున్నారు.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి..
#AndhraPrabha #AndhraPrabhaDigital