Saturday, November 23, 2024

AP | జూనియర్‌ కాంట్రాక్టు లెక్చరర్ల ఎంపికకు గ్రీన్‌ సిగ్నల్‌..

అమరావతి, ఆంధ్రప్రభ : ప్రభుత్వ జూనియర్‌ కళాశాలల్లోకి కాంట్రాక్టు లెక్చరర్ల రీ ఎంగేజ్‌మెంట్‌కు ప్రభుత్వం గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చింది. అర్హులైన 3,619 మంది జూనియర్‌ కాంట్రాక్ట్‌ లెక్చరర్లను తిరిగి విధులలోకి తీసుకోవడానికి నియామకానికి అనుమతినిస్తూ విద్యా శాఖ కార్యదర్శి కోన శశిధర్‌ ఉత్తర్వులు జారీ చేశారు.

నో పే నో వర్క్‌ విధానంలో 2024 జూన్‌ 1 నుంచి 2025 ఏప్రిల్‌ 30 వరకు 11 నెలల పాటు వీరికి అనుమతి మంజూరు చేశారు. ఇంటర్మీడియట్‌ అధికారులు తదుపరి చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. జూనియర్‌ కాంట్రాక్టు లెక్చరర్లకు గత ప్రభుత్వం ఇచ్చిన కాంట్రాక్టు గడువు ఈ యేడాది ఏప్రిల్‌తో ముగిసింది.

మే తదుపరి కొత్త ప్రభుత్వం ఏర్పడటంతో కాంట్రాక్టు పొడిగింపులో కొంత జాప్యం జరిగింది. జూన్‌ 1వ తేదీ నుంచి జూనియర్‌ కళాశాలలు ప్రారంభంకావడంతో గత కొద్ది రోజులుగా కాంట్రాక్టు లెక్చరర్లు తమ కాంట్రాక్టు గడువును రెన్యువల్‌ చేయాలని అధికారులను, ప్రజాప్రతినిధులను కోరుతున్నారు. ఈ నేపథ్యంలో తాజాగా ఇచ్చిన ఉత్తర్వులతో జూనియర్‌ లెక్చరర్లు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement