Tuesday, November 26, 2024

సీమ జిల్లాల్లో 2వేల మెగావాట్ల పవన, సౌర విద్యుత్ కు గ్రీన్ సిగ్నల్

తిరుపతి (రాయలసీమ ప్రభ వెబ్ ప్రతినిధి) : రాయలసీమ ప్రాంతానికి చెందిన నాలుగు జిల్లాలో 2వేల మెగావాట్లకు పైగా పవన, సౌర విద్యుత్ ప్రాజెక్టుల ఏర్పాటు చేయడానికి బుధవారం జరిగిన రాష్ట్ర మంత్రి మండలి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.. మంత్రి మండలి తీర్మానం ప్రకారం అనంతపురం జిల్లా రాళ్ళలో 250 మెగావాట్ల, కుర్బాపల్లి లో 251మెగావాట్ల, కమలపాడు, యాడికి లో 250 మెగావాట్లు, కర్నూల్ జిల్లాలో బేతం చర్ల లో 118 మెగావాట్లు, చిన్న కొడిమల్లిలో 251 మెగావాట్ల , మిట్ట పల్లిలో 100 మెగావాట్ల, జాలదుర్గంలో 130 మెగావాట్ల, సత్యసాయి జిల్లాలో కొండాపురం లో 250 మెగావాట్ల, నంద్యాల జిల్లా నొస్సం లో 506 మెగావాట్ల చొప్పున విద్యుత్ ప్రోజెక్టుల ఏర్పాటు చేయడానికి అవకాశం ఏర్పడనుంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement