ఆంధ్ర ప్రభ స్మార్ట్ – హైదరాబాద్ : ఏడో విడత గ్రీన్ ఇండియా ఛాలెంజ్ కార్యక్రమాన్ని మరో ఐదు రోజుల్లో ప్రారంభించనున్నట్టు రాజ్యసభ మాజీ సభ్యుడు, గ్రీన్ ఇండియా ఛాలెంజ్ సృష్టికర్త సంతోష్‌కుమార్ తెలిపారు. భారతదేశాన్ని హరితమయంగా మార్చేందుకు ‘హర హైతో భారా హై- గ్రీన్ ఇండియా చాలెంజ్’లో చేరాలని ఆయన పిలుపునిచ్చారు.
భూమిని చల్లగా ఉంచేందుకు, జీవజాతుల ప్రాణాలను కాపాడేందుకు సమిష్టిగా మొక్కలు నాటేందుకు ప్రజలంతా సిద్ధం కావాలని గురువారం ఎక్స్ వేదికగా పిలుపునిచ్చారు.
వాతావరణ సమత్యులత, జీవజాతుల ప్రాణాలను రక్షించడంలో పచ్చదనం పాత్రను గుర్తించడంలో భాగంగా ‘హర హైతో భారా హై- గ్రీన్ ఇండియా ఛాలెంజ్’ ఉద్యమం పుట్టిందని గుర్తుచేశారు.
మాజీ రాష్ట్రపతి, భారతరత్న డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం స్ఫూర్తితో వాతావరణ మార్పు, వాయు కాలుష్యాన్ని ఎదుర్కోనేందుకు మొక్కలు నాటి మానవాళికి మంచి భవిష్యత్తు అందించమే లక్ష్యంగా పచ్చదనానికి కృషిచేస్తున్నట్టు పేర్కొన్నారు.
ఏడో విడత గ్రీన్ ఇండియా ఛాలెంజ్ కార్యక్రమంలో పాల్గొనాలని ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, మాజీ రాజ్యసభ సభ్యులు, హీరో చిరంజీవి, నటుడు ప్రభాస్‌కు సంతోష్ కుమార్ పిలుపునిచ్చారు. ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి ఇతరులకు ఆదర్శంగా నిలవాలన్నారు.