పులిచెర్ల, (ప్రభన్యూస్): అడవుల ప్రాముఖ్యత, పర్యావరణ పరిరక్షణపై ప్రతి విద్యార్థికి అవగాహన ఉండాలని నేషనల్ గ్రీన్ కోర్ డివిజనల్ కన్వీనర్ రాజేంద్ర, గ్రీన్ మాస్టర్ వెంకట సిద్ధులు తెలిపారు. నేషనల్ గ్రీన్ కోర్ ఆధ్వర్యంలో ఆదివారం ట్రెక్కింగ్ లో భాగంగా ఎన్జీసీ విద్యార్థులు కల్లూరు నుండి పుల్లవాండ్లపల్లికు కాలినడ చేపట్టారు. పుల్లావాండ్లపల్లి రిజర్వాయర్, అడవుల ప్రాముఖ్యత, ప్లాస్టిక్ వినియోగం, పర్యావరణ పరిరక్షణ, జంతువులు, గ్రామీణ ప్రాంతాల్లోని ప్రజల సాంప్రదాయ ఆహారపు అవగాహన కల్పించారు.
ఈ సందర్భంగా ఎన్జీసీ ప్రతినిధులు రాజేంద్ర, వెంకట సిద్ధులు మాట్లాడుతూ విద్యార్థులు చదువుతో బాటూ పరిసరాలతో అవినాభావ సంబంధం ఏర్పరచుకోవాలన్నారు. శారీరక శ్రమను పొందాలని, అడవుల వలన ఉపయోగలను తెలుసుకోవాలన్నారు. వ్యవసాయ పరికరాలు, పద్ధతులు, వాటి ఉపయోగాలపై అవగాహన ఉండాలన్నారు. నడకతో శారీరక శ్రమ సాధ్యమవుతుందని, శరీర దారుడ్యం పెంపొందించుకునేందుకు అవకాశం ఉంటుందని తెలిపారు.
ఈ కార్యక్రమంలో హెచ్ ఎం పోకల తాతయ్య, వీ ఆర్ ఆర్ కళాశాల అధ్యాపకులు మహమ్మదలి, ఉపాధ్యాయులు నాగసుబ్బయ్య, ఆనందయ్య, ఎన్ జీసీ విద్యార్థులు పాల్గొన్నారు.
లోకల్ టు గ్లోబల్.. రియల్ టైమ్ న్యూస్ అప్ డేట్స్ కోసం.. ప్రభన్యూస్ ఫేస్‌బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
https://twitter.com/AndhraPrabhaApp, https://www.facebook.com/andhraprabhanewsdaily