Saturday, January 11, 2025

AP | గ్రీన్ కో ప్రాజెక్ట్ దేశంలోనే అద్భుతమైంది : డిప్యూటీ సీఎం పవన్

  • ఐటీ రంగం తర్వాత గ్రీన్ ఎనర్జీపై సీఎం ఫోకస్
  • గాలి, నీరు, సౌర కాంతితో విద్యుత్
  • ప్రభుత్వ భూముల ఆక్రమణలపై స్పెషల్ డ్రైవ్..

కర్నూల్ బ్యూరో : ఓర్వకల్లు మండలం పిన్నాపురంలో ఏర్పాటు చేస్తున్న గ్రీన్‌కో ఇంటిగ్రేటెడ్‌ రెన్యూవబుల్‌ ఎనర్జీ ప్రాజెక్టు దేశంలోనే అద్భుతమైన ప్రాజెక్టు అని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్‌ కల్యాణ్‌ అన్నారు. శనివారం ప్రాజెక్టును సందర్శించిన పవన్‌కల్యాణ్‌.. ఈ ప్రాజెక్ట్ దేశానికే మార్గదర్శకమన్నారు. ఒకే ప్రాంతంలో పవన విద్యుత్తు, సౌర విద్యుత్తు, హైడ్రాలిక్ పవర్ యూనిట్లను ఏర్పాటు చేయడం అభినందనీయమన్నారు.

ఈ సందర్భంగా పాత్రికేయుల సమావేశంలో మాట్లాడుతూ… సోలార్, ప‌వ‌న‌, జల విద్యుత్ ద్వారా పొల్యూషన్ లేని విద్యుత్ ఇక్కడ తయారవుతుందని అన్నారు. అనిల్ చలంశెట్టి, మహేష్… గ్రీన్ కో ప్రారంభించారన్నారు. వీరు సోలార్ ఇతర విద్యుత్ ఉత్పత్తి రంగంలో దేశంలో లక్షన్నర కోట్లు పెటుబడి పెట్టిన విషయాన్ని గుర్తు చేశారు.

ఏపీలో రూ.30 వేల కోట్లు పెట్టుబడి పెట్టారు.. మరో రూ.20 వేల కోట్లు పెట్టుబడి పెట్టనున్నారని పవన్ కల్యాణ్ తెలిపారు. పిన్నపురంలో రూ.10 వేల కోట్లు పెట్టుబడి పెట్టారు, ఇంకా 14 వేల కోట్లు పెట్టుబడి పెట్టనున్నట్లు ఉప ముఖ్యమంత్రి వెల్లడించారు. ఇక్కడ ఉత్పత్తి అయిన కార్బన్ రహిత శక్తి గ్రీన్ స్టీల్, గ్రీన్ అల్యూమినియం, గ్రీ హైడ్రోజన్ ఉత్పత్తి వంటి పరిశ్రమలకు సరఫరా చేయబడుతుందన్నారు.

గ్రీన్ కో ప్రాజెక్ట్ యాజమాన్యం అటవీ నిబంధనలను ఉల్లంఘించి 45 హెక్టార్లను ఆక్రమించిందంటే చూసేందుకు వచ్చానని పవన్ కల్యాణ్ అన్నారు. వాస్తవానికి గ్రీన్‌కో ప్రాజెక్టు నిర్మాణం కోసం 2800 ఎకరాల్లో 1700 ఎకరాలు కొనుగోలు చేశారు. వ్యవసాయానికి పనికిరాని భూముల్లో ఇలాంటి అద్భుతమైన ప్రాజెక్టు చేపడుతున్నట్లు ఉపముఖ్యమంత్రి చెప్పారు.

చంద్రబాబు ఐటీ తరువాత గ్రీన్ ఎనర్జీ పై దృష్టి పెట్టారు… అందులో భాగంగా పెట్టుబడులు వచ్చాయని పేర్కొన్నారు. దేశానికి ప్రతిష్టాత్మకమైనది రెన్యూవల్ ఎనర్జీ ప్రాజెక్టు అని అభిప్రాయపడ్డారు. దేశానికి రెండున్నర లక్షల పెట్టుబడులు తీసుకురాగలిగారు.. 365 ఎకరాలు కేంద్రం నుంచి అటవీ భూమి కొన్నారు. అందుకు కంపెనీ 365 ఎకరాల భూమి నెల్లూరు జిల్లాలో ఇచ్చారని వెల్లడించారు.

- Advertisement -

ఈ ప్రాజెక్టుకు సంబంధించిన 45 హెక్టార్ల భూమి రెవెన్యూ, అటవీ శాఖల మధ్య వివాదంలో ఉందని, దాన్ని పరిష్కరించేందుకే తాను వచ్చానని డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ తెలిపారు. ప్రాజెక్టు విషయంలో ఎలాంటి వివాదం వచ్చినా కేంద్రం దృష్టికి తీసుకెళ్తామని డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ అన్నారు.

ఇది భారీ ప్రాజెక్టు.. ఇందులో చిన్న చిన్న ఇబ్బందులు ఏర్పడడం సహజం కానీ వారికి పరిష్కరించుకుని పోతే.. మేలు జరుగుతుందన్నారు. భవిష్యత్తులో ఇదో పర్యాటక ప్రాంతంగా, ఎడ్యుకేషన్ టూర్ ప్లేస్ గా అభివృద్ధి చెందే అవకాశం ఉందన్నారు. ప్రాజెక్టు నిర్మాణంలో ఈ ప్రాంత యువతీ, యువకులకు ఉపాధి కల్పించేలా పనులు చేపట్టాలని సూచించారు.

కడప, చిత్తూరు జిల్లాలో ప్రభుత్వ భూములు ఎక్కువగా ఆక్రమణకు గురవుతున్నాయని.. అటవీశాఖ భూముల ఆక్రమణలపై రెవెన్యూ, అటవీ భూముల వివాదాలపై సమీక్ష చేస్తానని చెప్పారు. కాగా, 2021లో కర్నూలులో గ్రోన్ కో ప్రాజెక్టు ప్రారంభం అయ్యిందని, ఈ ప్రాజెక్టు ద్వారా 10 వేల మందికి ప్రత్యక్షంగా, 40 వేల మందికి పరోక్షంగా ఉపాధి లభిస్తోందని ఆయన తెలిపారు. భవిష్యత్తులో ఇదో గొప్ప పర్యాటక ప్రాంతం అవుతుందని పవన్ ఆశాభావం వ్యక్తం చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement