Monday, November 18, 2024

మెడికవర్ హాస్పిటల్స్ కు గ్రేట్ ప్లేస్ టు వర్క్ సర్టిఫికేట్

కర్నూలు, (ప్రభ న్యూస్ బ్యూరో) : కర్నూల్ నగరంలోని మెడికవర్ హాస్పిటల్స్ కు గ్రేట్ ప్లేస్ టు వర్క్ సర్టిఫికేట్ దక్కింది. ఈ మేరకు కర్నూల్ ఎమ్మెల్యే అబ్దుల్ హఫీజ్ ఖాన్, కోడుమూరు ఎమ్మెల్యే జరదొడ్డి సుధాకర్ , జిల్లా కలెక్టర్ పీ.కోటేశ్వర రావు చేతుల మీదుగా శుక్రవారం జరిగిన కార్యక్రమంలో హాస్పిటల్స్ క్లస్టర్ హెడ్ మహేశ్వర్ రెడ్డి అందుకున్నారు. ఈ సందర్భంగా కర్నూల్ ఎమ్మెల్యే హఫీజ్ ఖాన్ మాట్లాడుతూ ప్రపంచవ్యాప్తంగా ఉన్న వేలాది సంస్థలు ప్రతి సంవత్సరం ఈ గుర్తింపును సాధించాలని ఆకాంక్షిస్తున్నాయన్నారు.

ఇది అనేక అర్హత ప్రమాణాలకు సాక్ష్యమిచ్చిన తర్వాత మాత్రమే సాధ్యమవుతుంది. ఈ సర్టిఫికెట్ పొందటం మేడికవర్ సంస్థకి ఎంతో గర్వించదగ్గ విషయమన్నారు. మేడికవర్ క్లస్టర్ హెడ్ మహేశ్వర్ రెడ్డి మాట్లాడుతూ, “ఈ విశిష్ట సర్టిఫికేషన్‌ను సంపాదించడం మాకు గౌరవంగా ఉందన్నారు. ఇలాంటి సర్టిఫికెట్ తో మేడి కవర్ ఉద్యోగులలో బాధ్యతలను మరింత పెంచిదన్నరు. పనితీరు, పెరుగుదల, ప్రశంసలతో పాటు మా నిబద్ధత, ఆత్మవిశ్వాసంకు
నిదర్శనంగా నిలిచింది అన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement