టంగుటూరు మార్చి 31(ప్రభ న్యూస్) అంతా మా ఇష్టం,అధికారం మాదే , అడిగేది ఎవరు,అపేది ఎవరు, కొండను సైతం పిండి చేస్తున్నారు.అధికార పార్టీ అండదండలతో వైసిపి నేతలు మాఫియా తో చేతులు కలిపి ప్రకృతి సంపదను దోచుకుంటున్నారు.కోట్లాది రూపాయలు కొల్లకోట్టుతున్నారు, మండలంలోని మర్లపాడు కొణిజేడు, కందులూరు ప్రాంతాల్లో గ్రావెల్ మాఫియా అధికారపార్టీ నేతలు తో చేతులు కలిపి కొండను ఇష్టారాజ్యంగా తవ్వకాలు చేస్తున్నారు.పట్టుదల ఉండే ఏదైనా సాధించవచ్చు,అనే నానుడి తో మాఫియా అధికార పార్టీ నేతలు తో కలిసి కొండను పిండి చేస్తున్నారు.ప్రభత్వ భూముల్లో గ్రావెల్ నిషేధం అని రెవెన్యూ అధికారులు హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేసిన మాఫియా మాజీ మంత్రి మా వాడే అంతా ఇష్టం కేంద్ర ప్రభుత్వం పరిధిలో ఉన్న తవ్వకాలు చేస్తామని ఎర్ర బంగారం దోచుకుంటున్నారు,
ఒంగోలు, కొండేపి,దర్శి , చీమకుర్తి, అద్దంకి ప్రాంతాల్లో ఎర్ర గ్రావెల్ కు డిమాండ్ ఉండడంతో మాఫియా లక్షలు దోపిడీ చేస్తున్నారు.గతంలో జగనన్న లేఅవుట్ లు పేరుతో మాఫియా ఇళ్ల నిర్మాణం పేరుతో గ్రావెల్ ను అక్రమంగా తరిలించి సొమ్ము చేసుకున్నారు. రెవెన్యూ,సెబ్ అధికారులు మాఫియా తో చేతులు కలిపి నెలనెలా మామూళ్లు తీసుకుంటురాని సమాచారం.తూతు మంత్రముగా దాడులు చేసి వదిలి వేస్తున్నారని సమాచారం.అధికార పార్టీ నేతలు పోన్ చేయగానే పట్టుకున్న టిప్పర్ లను అక్కడే వదిలి వేస్తున్నారు.మిగతా అధికారులు మామూళ్లు నెలనెలా ఇస్తున్నాం మీకు పంపిస్తాము మా జోలికి రావద్దని మాఫియా అధికారులు కు ఆఫర్ లు ఇవ్వడం విశేషం.
అక్రమాలను అరికట్టాల్సిన అధికారులే మాఫియా తో చేతులు కలపడం తో ఇష్టారాజ్యంగా మాఫియా కొండను తవ్యే స్తున్నారు .కోట్లు సంపాదిస్తున్నారు.ఒంగోలు ప్రాంతంలో వంద అడుగులు గుంతలు సైతం ఎర్ర గ్రావెల్ తో పూడ్చి వేశారు.ఎర్ర గ్రావెల్ తో స్థలాలను చదరం చేసి పాట్లు గా మార్చి కోట్లలో వ్యాపారం జరుగుతుంది.ఇది అంతా అధికారులుకు తెలిసిన దాడులు చేయరు, పట్టుకున్న పైసలు తీసుకుని వదిలివేస్తారని సమాచారం.ఇకనైనా అధికారులు స్పందించి కొణిజేడు, మర్లపాడు, కందులూరు ప్రాంతాల్లో గ్రావెల్ మాఫియా ను అరికట్టాలని మండల ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.