ఎన్టీఆర్, ప్రభ న్యూస్ బ్యూరో: అధికారం అడ్డం పెట్టు-కుని సహజ సంపదను కొల్లగొడుతున్నారు. అధికారులు సైతం వీరికి వంత పాడుతున్నారు. నిలుపుదల కోసం కోర్టులు ఆదేశాలు ఇచ్చినా ఖాతరు చేయకపోవడం, పరిస్థితిని చూసిన అధికార పార్టీ ఎమ్మెల్యే ఉన్నతాధికారులకు లేఖ రాయడం దారుణ పరిస్థితికి అద్దంపడు తున్నది. ఇక తప్పనిసరి పరిస్థితు ల్లో కలగజేసుకున్న అధికారులు, విజిలెన్స్ రెవెన్యూ అధికారులు స్వయంగా రంగం లోకి దిగి మట్టి మాఫియా ఆగడాల ను ప్రస్తుతానికి అడ్డుకట్ట వేశారు. అయితే ఒకట్రెం డు రోజులు మాత్ర మే ఆగుతున్న దందా తరువాత మళ్ళీ మామూలే అవుతుందని స్థానికులు ఆరోపిస్తున్నారు. ఉమ్మడి కృష్ణా జిల్లాలో మట్టి మాఫియా సహజ సంపదను కొల్లగొడుతోంది. ముఖ్యంగా పోలవరం కాలువకు సంబంధించి మట్టిని రాత్రనకా, పగలనకా వందల సంఖ్యలో లారీలతో తరలించి రూ. కోట్లు సంపాదిస్తున్నారు.
మైలవరం నియోజకవర్గంతో పాటు- పక్కనే ఉన్న గన్నవరం, జగ్గయ్యపేట ఇలా అన్ని ప్రాంతాల్లో ఆగడాలు కొనసాగుతూనే ఉన్నాయి. మైలవరం నియోజకవర్గ పరిధిలోని కొత్తూరు తాడేపల్లి, జక్కంపూడి, వెలగలేరు, గన్నవరం పరిధిలో కొన్ని ప్రాంతాలు, జగ్గయ్యపేట పరిధిలో మరికొన్ని ప్రాంతాల్లో పోలవరం కాలువ పరిధిలో అన్ని ప్రాంతాల్లో మట్టి మాఫియా యదేచ్చగా కొల్లగొడుతోంది. 2019 నుండి మట్టి మాఫియా దందా కొనసాగుతూ ఉందని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. ఎన్నోసార్లు స్థానిక ఎమ్మార్వో, కలెక్టర్, ఆర్డిఓలకు చెప్పినా ఎవరూ పట్టించుకోలేదంటు-న్నారు. స్పందనలో కూడా ఎన్నిసార్లు ఫిర్యాదు చేసిన ఫలితం రాలేదంటు-న్నారు. విజయవాడ పరిధిలో వెలుస్తున్న కొత్త వెంచర్లకు ఇక్కడి నుండే మట్టిని తరలించి లారీకి రూ.8000 వరకు వసూలు చేస్తున్నట్లు- చెబుతున్నారు. తప్పనిసరి పరిస్థితుల్లో కొందరు ఎన్జీటీ-కి, పిల్లా సురేంద్ర అనే వ్యక్తి హైకోర్టును ఆశ్రయించినట్లు- తెలుస్తోంది. ఈ సందర్భంగా హైకోర్టు కూడా తవ్వకాలను ఆపి సమగ్ర విచారణ జరపాలని ఆదేశాలిచి ఎన్ని రోజులైనా అధికారులు అమలు చేయడం లేదంటు-న్నారు. రోజుకు 1000 లోడ్లకు పైగా మట్టిని అన్ని ప్రాంతాల నుండి తరలించుకుపోతున్నట్లు- గ్రామస్తులు చెబుతున్నారు…
అధికార పార్టీ ఎమ్మెల్యే ఫిర్యాదుతో…
అధికార పార్టీకి చెందిన మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ ఈ మట్టి తవ్వకాలపై జిల్లా కలెక్టర్ ఢిల్లీ రావుకు ఇటీ-వల ఒక లేఖ రాశారు. తన నియోజకవర్గ పరిధిలోని పలు ప్రాంతాల్లో అనుమతి లేకుండా మట్టి తవ్వకాలు జరుగుతున్నట్లు- అందులో తెలిపారు. వాటిని అరికట్టాలని గత నెల 30వ తేదీన ఆయన కలెక్టర్‌కు లేఖ రాశారు. ఎమ్మెల్యే రాసిన లేఖతో రంగంలోకి దిగిన విజిలెన్స్, రెవెన్యూ, మైనింగ్ అధికారులు రెండ్రోజులుగా విస్తృతంగా దాడులు నిర్వహించి లారీలను ఎక్కడికక్కడ అడ్డుకుంటు-న్నారు. అయితే తూతూ మంత్రంగా ఒకటి రెండు రోజులు దాడులు చేయడం కాకుండా పూర్తిస్థాయిలో నిఘా పెట్టి లారీలను అడ్డుకోవడంతోపాటు- సంబంధించిన వ్యక్తులపై కేసులు నమోదు చేసి వారిని శిక్షించాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.