Friday, November 22, 2024

నాడు- నేడు విధుల్లో పాల్గొన్న హెడ్మాస్టర్‌లకు ఈఎల్స్‌ మంజూరు చేయండి : కత్తి నరసింహారెడ్డి..

అమరావతి, ఆంధ్రప్రభ: రాష్ట్రంలోని 15 వేల 713 పాఠశాలల్లో చేపట్టిన మొదటి దశ నాడు- నేడు విధుల్లో పాల్గొన్న హెడ్మాస్టర్‌లకు సంపాదిత సెలవులు(ఈఎల్స్‌) మంజూరు చేయాలని ఎమ్మెల్సీ కత్తి నరసింహారెడ్డి ప్రభుత్వాన్ని కోరారు. మంగళవారం శాసనమండలిలో జీరో అవర్లో ఆయన మాట్లాడుతూ 2020 మే వేసవి సెలవుల్లో విధులు నిర్వహించిన ఉపాధ్యాయులకు సంపాదిత సెలవులు ఇస్తామని హామీ ఇచ్చినప్పటికీ అమలు కాలేదన్నారు. సంపాదిత సెలవులు ఇవ్వాలని జీవో 40, 35లు స్పష్టం చేస్తున్నప్పటికీ దస్త్రం తిరుగుతున్నదే కానీ ఉత్తర్వులు విడుదల కాలేదని, కనుక వెంటనే ఉత్తర్వులు విడుదల చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. రాష్ట్రంలోని పురపాలక నగరపాలక ఉపాధ్యాయలకు ప్రావిడెంట్‌ ఫండ్‌ సౌలభ్యం, హెడ్మాస్టర్‌ లకు డీడీఓ అధికారాలు ఇవ్వడంతోపాటు- పురపాలక ఉన్నత పాఠశాలల్లో కూడా ఇంటర్‌ విద్యను ప్రవేశపెట్టాలని పురపాలక శాఖ మంత్రికి చేసిన ప్రాతినిధ్యంపై సానుకూలంగా స్పందించారని కత్తి నరసింహారెడ్డి తెలిపారు. సమస్యల పరిష్కారానికి ఈ నెల 22న ఎమ్మెల్సీలతో ప్రత్యేక సమావేశం ఏర్పాటు- చేస్తామని హామీ ఇచ్చారన్నారు.

ట్రిపుల్‌ ఐటీ- కాంట్రాక్ట్‌ అధ్యాపకులకు ఎంటీఎస్‌ అమలు చేయండి..

రాష్ట్రంలోని ట్రిపుల్‌ ఐటీలలో పనిచేస్తున్న కాంట్రాక్ట్‌ అధ్యాపకులకు మినిమల్‌ టైం స్కేల్‌ అమలు చేయాలని కోరుతూ విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్‌ను కలిసి ప్రాతినిధ్యం చేశామని కత్తి నరసింహారెడ్డి- తెలిపారు. సమస్య పరిష్కారానికి కృషి చేస్తానని ఆయన హామీ ఇచ్చారన్నారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement