Thursday, December 12, 2024

AP | జ‌గ‌న్ కు గ్రంధి శ్రీనివాస్ కూడా బైబై చెప్పేశారు

భీమ‌వ‌రం – వైసీపీకి గుబ్ బై చెప్పేస్తున్నారు నేతలు. విశాఖ మాజీ ఎమ్మెల్యే అవంతి శ్రీనివాస్ కాగా, లేటెస్ట్‌గా భీమవరం మాజీ ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్ వంతైంది. తాజాగా ఆయన పార్టీకి, పదవులకు రాజీనామా చేశారు. రాజీనామా లేఖను అధినేత జగన్‌కు పంపారు. ఎన్నిక‌ల అనంత‌రం ఆయ‌న వైసీపీ కార్యకలాపాలకు శ్రీనివాస్ దూరంగా ఉంటున్నారు. ఇటీవల జిల్లాలోని నియోజకవర్గ ఇంఛార్జ్ లతో సిఎం జగన్ నిర్వ‌హించిన సమావేశానికి మాజీ ఎమ్మెల్యే డుమ్మా కొట్టారు.

అప్ప‌టి నుంచే ఆయ‌న పార్టీ మారుతున్న‌ట్లు వార్తలు విన‌వ‌స్తున్నాయి. తాజాగా నేడు ఆయ‌న వైసీపీని వీడుతున్న‌ట్లు ప్ర‌క‌టించారు.. చాలా కాలంగా పార్టీ పట్ల అసంతృప్తితో ఉన్న గ్రంధి శ్రీనివాస్ పార్టీని వీడతారని ప్రచారం జరుగుతూనే ఉంది. ఈ నేపథ్యంలోనే ఆయన ఈరోజు వైసీపీకి గుడ్ బై చెప్పేశారు. అయితే తన రాజకీయ భవిష్యత్తుపై శ్రీనివాస్ ఎటువంటి ప్రకటన చేయలేదు. శ్రీనివాస్ టీడీపీలో చేరేందుకు సిద్ధమవుతున్నారని తెలుస్తోంది. ఈ ప్రకారమే కొందరు టీడీపీ నేతలతో ఆల్రెడీ ఆయన మంతనాలు జరిపినట్లుగా ప్రచారం జరుగుతుంది.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement