Monday, June 24, 2024

Grand Welcome – ఉప ముఖ్యమంత్రి ప‌వ‌న్ కు అమ‌రావ‌తి రైతుల ఘ‌న స్వాగ‌తం ….

డిప్యూటీ సీఎం గా ప‌ద‌వీ బాద్య‌త‌లు స్వీకరించిన త‌ర్వాత తొలిసారి ప‌వ‌న్ క‌ల్యాణ్ నేడు అమ‌రావ‌తికి వ‌చ్చారు.. ఈ సంద‌ర్భంగా పవన్‌ కల్యాణ్‌కు రాజధాని ప్రాంత రైతుల నుంచి ఘన స్వాగతం లభించింది. సీడ్‌ యాక్సెస్‌ రోడ్డు వద్దకు వాహనశ్రేణి చేరుకోగానే భారీ గజమాలతో పవన్‌ను సత్కరించారు. వెంకటపాలెం నుంచి మందడం వరకు దారి పొడవునా పూలు చల్లుతూ నీరాజనాలు పలికారు. అనంతరం పవన్‌ వెలగపూడి సచివాలయం చేరుకోనున్నారు. అక్కడ తనకు కేటాయించిన ఛాంబర్‌ను డిప్యూటీ సీఎం పరిశీలించారు. ఇక . బుధవారం ఆయన ఉప ముఖ్య‌మంత్రిగా బాధ్యతలు చేపట్టనున్నారు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement