ప్రభన్యూస్ : ఇంధన పొదుపుపై గ్రామీణ ప్రాంత ప్రజల్లో అవగాహన పెంపొందించడంతోపాటు- వారికి నాణ్యమైన వెలుతురును అందించే ప్రయత్నాల్లో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం గ్రామీణ ప్రాంతాల్లోని ఇళ్లకు 10 లక్షల ఎల్ఈడీ బల్బులను పంపిణీ చేయనుంది. సీఈఎస్ఎల్ మద్దతుతో ఈఏడాది డిసెబరు 14నుండి వచ్చే ఏడాది ఫిబ్రవరి 15 మధ్య గ్రామ ఉజాల ప్రోగ్రామ్ కింద ఎల్ఈడీ బల్బులను రూ.10 కే అందించనున్నారు. ఎనర్జీ ఎఫిషియెన్సీ సర్వీసెస్ లిమిటెడ్ (ఈఈఎస్ఎల్) అనుబంధ సంస్థ కన్వర్జెన్స్ ఎనర్జీ సర్వీసెస్ లిమిటెడ్ (సీఈఎస్ఎల్) జాతీయ ఇంధన పరిరక్షణ దినోత్సవాన్ని పురస్కరించుకుని ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ సందర్భంగా ఎల్ఈడీ బల్బులను సరఫరా చేస్తుంది.
దేశ వ్యాప్తంగా గ్రామ ఉజాలా కార్యక్రమాన్ని అమలు చేసేందుకు ఎంపికైన ఉత్తరప్రదేశ్, మహారాష్ట్ర, బీహార్ మరియు గుజరాత్‌తో పాటు ఐదు రాష్ట్రాల్రలో ఆంధ్రప్రదేశ్ ఒకటిగా నిలచింది. 10 లక్షల ఎల్ఈడీ బల్బుల పంపిణీకి అయ్యే మొత్తం ఖర్చును సీఈఎస్ఎల్ భరించనుంది. ఈ కార్యక్రమ అమలువల్లే అటు విద్యుత్ సంప్థలపైనా ఇటు రాష్ట్ర ప్రభుత్వంపైనా ఎలాంటి ఆర్థిక భారం ఉండదని సీఈఎస్ఎల్ స్పష్టం చేసింది.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి..
#AndhraPrabha #AndhraPrabhaDigital