Tuesday, November 26, 2024

ఎపిలో డిజిట‌ల్ రేష‌న్…

అమరావతి, ఆంధ్రప్రభ: రేషన్‌ బియ్యం దారి మళ్ళిం పునకు చెక్‌ పెట్టేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. మాఫి యా ఆగడాలకు కళ్లెం వేసేందుకు పక్క స్కెచ్‌ వేసింది. ఇందులో భాగంగా డిజిటల్‌ సాంకేతికతను తెరపైకి తేనుం ది. ప్రతి బస్తాకు క్యూఆర్‌ కోడ్‌ సీల్‌ వేయడం ద్వారా అక్రమా లకు చెక్‌ పెట్టాలని భావిస్తోంది. చెలరేగిపోతున్న రేషన్‌ మాఫియాను అడ్డుకోవడంలో భాగంగా క్యూ ఆర్‌ కోడ్‌ విధానంపై ప్రభుత్వం దృష్టి పెట్టింది. ప్రతి బస్తాను ట్రాకింగ్‌ చేసేందుకు వీలుగా అన్ని బియ్యం బస్తాలపై సెక్యూరిటీ సీల్‌ ముద్రించనున్నట్లు తెలుస్తోంది. దీని వల్ల ఏ బస్తాను ఎక్కడికి పంపిస్తున్నారనేది స్పష్టంగా తెలియనుంది. పైలెట్‌ ప్రాజెక్ట్‌ గా త్వరలోఎన్టీఆర్‌, కృష్ణా, గుంటూరు, పల్నాడు, ఏలూరు, పశ్చిమ గోదావరి జిల్లాల్లో అమలు చేసేందుకు సివిల్‌ సప్లైస్‌ అధికారులు కసరత్తు చేస్తున్నారు. సత్ఫలితాలు వచ్చినట్లైతే రాష్ట్రంలోని 26 జిల్లాల్లో ఇదే విధానాన్ని అమలు చేయాలని భావిస్తుట్లు తెలుస్తోంది. పేదల కడుపు నింపేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రాష్ట్రంలో 1 కోటి 46 లక్షల కుటుంబాలకు రేషన్‌ అందిస్తోంది. పలువురు రేషన్‌ కార్డుదారులు ఆ బియ్యాన్ని తిరిగి ఎండీయూ ఆపరేటర్లకు కేజీ రూ.7 నుంచి రూ.9 చొప్పున విక్రయిస్తున్నారనేది బహిరంగ రహస్యం. కార్డుదారుల నుంచి కొనుగోలు చేస్తున్న బియ్యాన్ని ప్రైవేటు వ్యాపారులు, మిల్లర్లు కల్సి రాష్ట్రాలు దాటించి అడ్డగోలుగా సొమ్ము చేసుకుంటున్నారు. ఈక్రమంలో ప్రతి బియ్యం బస్తాపైన క్యూ ఆర్‌ కోడ్‌ సెక్యూరిటీ సీల్‌ను వేసి క్షేత్రస్థాయిలో పేదలకు పంపిణీ చేసే వరకు ట్రాకింగ్‌ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. తద్వారా బియ్యం అక్రమ రవాణాకు చెక్‌ పెట్టాలన్నది ప్రభుత్వ ఉద్దేశ్యంగా తెలుస్తోంది.

సాంకేతికతతో కళ్లెం
శతకోటి దరిద్రాలకు అనంత కోటి ఉపాయాలు అన్న చందంగా రేషన్‌ పంపిణీలో సాగుతున్న అక్రమాలను ఒక్కొ క్కటిగా అరికట్టేందుకు ప్రభుత్వం డిజిటల్‌ సాంకేతికతపై ఆధార పడుతోంది. ఈక్రమంలో పరేషాన్‌ అవుతున్న ఇంటి వద్దనే రేషన్‌పై ప్రభుత్వం నిఘా పెట్టింది. రేషన్‌ పంపిణీ చేస్తున్న మొబైల్‌ డిస్పెన్సరీ యూనిట్‌(ఎండీయూ)తో వాహనాలకు జీపీఎస్‌ తో పాటు- సీసీ కెమెరాలు అమర్చి పంపిణీ తీరును సివిల్‌ సప్లైస్‌ అధికారులు పర్యవేక్షణ చేస్తు న్నారు. పైలెట్‌ ప్రాజెక్ట్‌గా గతేడాది నవంబర్‌ నెలలో రాష్ట్ట్ర వ్యాప్తంగా దీన్ని అమల్లోకి తెచ్చారు. మండలానికి ఒకటి చొప్పు 679 ఎండీయూలను ఎంపిక చేశారు. ప్రతి వాహనా నికి జిపిఎస్‌, సీసీ కెమెరాలు ఏర్పాటు- చేస్తున్న అధికారులు, సాంకేతిక పరిజ్ఞానంతో నేటి నుండి పర్యవేక్షణ చేస్తున్నారు. పౌర సరఫరాల శాఖ కమిషనర్‌ కార్యాలయానికి వీటిని అను సంధానం చేసి పంపీణీ జరుగుతున్న విధానాన్ని పరిశీలన చేస్తున్నారు. వాహనాలు ప్రయాణిస్తున్న రహదారితో పాటు , పంపిణీ జరుగుతున్న ప్రాంతాలను గుర్తిస్తున్నారు. రాష్ట్రం లోని 26 జిల్లాల పరిధిలో 29,670 మంది రేషన్‌ డీలర్లు ఉన్నారు. గతంలో షాపుల ద్వారానే లబ్ధిదారులకు రేషన్‌ పంపిణీ జరిగేది. వైసీపీ అధికారంలోకి వచ్చాక ఇంటి వద్దకే రేషన్‌ అందించాలనే ఉద్దేశ్యంతో మొబైల్‌ డిస్టెన్సివ్‌ యూనిట్‌ ఆపరేటర్ల వ్యవస్థను అందుబాటులోకి తెచ్చింది. ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీ కార్పొరేషన్ల ద్వారా 9,200 మొబైల్‌ వెహికిల్స్‌ను వారికి అందజేసింది. ఇళ్ళ వద్దే రేషన్‌ అందించినందుకు గాను నెలకు రూ.21 వేల రూపాయలను ఒక్కో ఆపరేటర్‌కు అందిస్తోంది. ఒక్కొక్క వాహనానికి సుమారు 7 లక్షల వరకు ప్రభుత్వం ఖర్చు చేసింది. కొద్ది రోజుల పాటు సజావుగా సాగి న మొబైల్‌ పంపిణీ వ్యవస్థలో అక్రమాలకు తెరలేచింది. ఒక్కో ఎండీయూ పరిధిలో 50నుంచి 200 ఇళ్ళు ఉంటే ఆరు నుంచి పది ఇళ్లలోపు వాహనాన్ని ఆపి రేషన్‌ అందించాలి. అధిక శాతం ఎండీయూ ఆపరేటర్లు వీధి చివర బండి ఆపి ప్రజలతో క్యూ కట్టిస్తున్నారు. రేషన్‌ షాపునకు ఎండీయూకు పెద్ద తేడా లేకుండా చేస్తున్నారు. దీంతో ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తం అవుతోంది. ఇకపై ప్రతి వీధిలో నాలుగు నుండి ఐదు ప్రాంతాల్లో వాహనాన్ని నిలుపుదల చేసి రేషన్‌ పంపిణీ చేయాల్సి ఉంటు-ంది. జీపీఎస్‌ విధానం ద్వారా వాహనం ఎన్ని చోట్ల ఆగింది అనే విషయాన్ని అధికారులు పసిగడుతున్నారు.

త్వరలో అన్నింటికీ జీపీఎస్‌
రేషన్‌ పంపిణీలో డీలర్లు అక్రమాలకు పాల్పడేవారనే విమర్శలు బలంగా ఉండేవి. ఈక్రమంలో ఎండీయూ వ్యవస్థ ద్వారా పూర్తి పారదర్శకతతో సులభంగా.. వేగంగా రేషన్‌ సరుకుల్ని ప్రజల ఇంటి వద్దనే పంపి ణీ చేయాలన్నది ప్రభుత్వ లక్ష్యం. ఈవిధానంపై పలు రాష్ట్రాలు ఆసక్తిని కనబర్చాయి. ఎండీయూలు ప్రతినెలా 1వ తేదీ నుండి 15వ తేదీలోపు వారి పరిధిలో ఉన్న కార్డుదారులకు ఇంటి వద్దకే వెళ్లి రేషన్‌ సరుకులను అందించాల్సి ఉన్నప్పటికీ అలా జరగడం లేదనేది బహిరంగ రహస్యం. పైలెట్‌ ప్రాజెక్ట్‌ ద్వారా ఎండీయూల పనితీరు మార్చాలని జీపీఎస్‌ విధానాన్ని అమల్లోకి తెచ్చారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement