కోవిడ్ నుంచి కోలుకున్న వారిని బ్లాక్ ఫంగస్ రూపంలో మరో సమస్య వేధిస్తున్న సంగతి తెలిసిందే. దేశ వ్యాప్తంగా ఈ తరహా కేసులు భారీగా పెరుగుతున్నాయి. ఇప్పటికే కోవిడ్ చికిత్సను ఆరోగ్యశ్రీలో చేర్చిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్.. బ్లాక్ ఫంగస్ చికిత్సను ఆరోగ్యశ్రీలో చేర్చాలని ఆదేశించారు. దీంతో రాష్ట్రంలోని వివిధ ఆస్పత్రుల్లో బ్లాక్ ఫంగస్ తో బాధ పడే రోగులకు చికిత్స అందించనున్నారు. రాష్ట్రవ్యాప్తంగా 17 ఆస్పత్రుల్లో ఆరోగ్య శ్రీ కింద బ్లాక్ ఫంగస్ కు ఉచితంగా చికిత్స అందిస్తారు. బ్లాక్ ఫంగస్ చికిత్స అందించే ఆస్పత్రుల వివరాలు..
- అనంతపూరం ప్రభుత్వ జనరల్ ఆసుపత్రి (జీజీహెచ్)
- ఎస్వీఆర్ఆర్ జీజీహెచ్, తిరుపతి
- స్విమ్స్, తిరుపతి
- జీజీహెచ్, కాకినాడ
- జీజీహెచ్, గుంటూరు
- జీజీహెచ్ (రిమ్స్), కడప
- జీజీహెచ్, విజయవాడ
- గవర్నమెంట్ రీజినల్ ఐ ఆసుపత్రి, కర్నూల్
- జీజీహెచ్, కర్నూలు
- జీజీహెచ్ (రిమ్స్), ఒంగోలు
- జీజీహెచ్ (ఏసీఎస్ఆర్ ప్రభుత్వ మెడికల్ కళాశాల), నెల్లూరు
- జీజీహెచ్, శ్రీకాకుళం
- ప్రభుత్వ ఈఎన్టీ ఆసుపత్రి, విశాఖపట్నం
- గవర్నమెంట్ రీజనల్ ఐ హాస్పిటల్, విశాఖపట్నం
- ప్రభుత్వ ఛాతీ వ్యాధుల ఆసుపత్రి (ఆంధ్ర మెడికల్ కాలేజి)
- కింగ్ జార్జ్ ఆసుపత్రి, విశాఖపట్నం
- విమ్స్, విశాఖపట్నం.