ఆంధ్ర ప్రదేశ్ లో రైతులు, మహిళలకు ప్రభుత్వం గుడ్ న్యూస్ తెలిపింది. లోక్ సభ ఎన్నికల అనంతరం సైతం వివిధ పథకాల ద్వారా లబ్దిదారుల ఖాతాల్లో నిధులు జమ అవుతున్నాయి. మహిళలకు వైఎస్సార్ ఆసరా పథకం నిధులను ప్రభుత్వం రిలీజ్ చేసింది. మొత్తం రూ.1843 కోట్లను లబ్దిదారుల ఖాతాలలోకి అధికారులు జమ చేశారు.
రైతులకు కూడా ఇన్ పుట్ సబ్సీడీ డబ్బులన రిలీజ్ చేశారు.వైఎస్సార్ చేయూత పథకం కింద లబ్దిదారుల అకౌంట్లలో రూ. 1552 కోట్లు జమ చేశారు. రైతుల ఖాతాల్లో రూ.1236 కోట్లను విడుదల చేశారు. ఈబీసీ నేస్తం కింద అగ్రవర్ణ పేదలకు రూ.629 కోట్లు, జగనన్న విద్య దీవెన ద్వారా ఫీజు రీయింబర్స్ మెంట్ కింద విద్యార్థుల తల్లుల అకౌంట్‌లోకి రూ.605 కోట్లను విడుదల చేసినట్లు అధికారులు వెల్లడించారు.