Friday, November 22, 2024

వరద బాధితుల పట్ల ప్రభుత్వానికి చీమకుట్టినట్లు లేదు: సీపీఎం

చింతూరు, (అల్లూరి జిల్లా), ప్రభ న్యూస్‌: ముంపు మండలాలను వరదలు ముంచివేసి ప్రజా జీవితాన్ని అతలాకుతలం చేసిన ప్రభుత్వానికి వరద బాధితుల పట్ల చీమకుట్టినట్లు లేదని సీపీఎం రాష్టృ కార్యదర్శి వి శ్రీనివాస్‌ రావు విమర్శించారు. చింతూరులో సీపీఎం కార్యాలయంలో గురువారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ వరద ముంపులో ప్రజలు అష్ట కష్టాలు పడ్డారని, జరదిగ్బంధంలో వందలాది గ్రామాలు చిక్కుకొని ఆహారం దొరకక అల్లాడిపోయారని అన్నారు. జులై నెల 18వ తేదీ నుండి వరద ఉధృతి పెరిగి 24 వరకు కొనసాగిందని రోడ్లు పాడైపోయి రహదారి సౌకర్యాలు కూడా కనుమరుగయ్యాన్నారు.

వరద పునరావాస కేంద్రాల్లో సరైన వసతులు కల్పించడంలో ప్రభుత్వం విఫలమైందన్నారు. . కూలీ పనులు చేసుకునే కార్మికులకు వరదల సమయంలో పనులు లేక పస్తులు ఉండే పరిస్థితి నెలకొందని ఇలాంటి వారందరకి ప్రభుత్వం పరిహారం అందించాలని డిమాండ్‌ చేశారు. వరద సహాయం చేయడంలో కూడా రాజకీయం చేస్తూ అధికార పార్టీ వారు చెప్పినట్లు-గా పరిహారం నిత్యావసరాలు అందించే దానిలో అవినీతికి పాల్పడుతున్నట్లు- ఆరోపణలు వచ్చాయన్నారు. అనంతరం వరద ముంపునకు గురైన బాధిత కుటుంబాలను కలసి పరామర్శించి వారి కష్టాలను అడిగి తెలుసుకున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement