గవర్నర్ వ్యవస్థను రద్దు చేయాలని సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ అన్నారు. ఆయన మాట్లాడుతూ… కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య ఏజెంట్లుగా వ్యవహరిస్తున్న గవర్నర్ వ్యవస్థ వల్ల ఉపయోగం లేదన్నారు. రాష్ట్రంలో జగన్ పాలనను సరిదిద్దాల్సిన గవర్నర్.. సీఎంకు వంత పాడుతున్నారని మండిపడ్డారు. ఎంతో రాజకీయ అనుభవమున్న మన రాష్ట్ర గవర్నర్ వల్ల ఎలాంటి ప్రయోజనం లేదన్నారు. దేశ చరిత్రలోనే మొదటి సారిగా గవర్నర్ ప్రసంగం లేకుండా తెలంగాణ రాష్ట్రంలో బడ్జెట్ సమావేశాలు నిర్వహించారంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవాలన్నారు.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి..
#AndhraPrabha #AndhraPrabhaDigital