ఏపీ బడ్జెట్ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమయ్యాయి. అసెంబ్లీ సమావేశాల్లో గవర్నర్ ప్రసంగం సందర్భంగా టీడీపీ సభ్యులు పోడియంపై పేపర్లు విసురుతూ అడ్డుకున్నారు. గవర్నర్ గో బ్యాక్ అంటూ నినాదాలు చేశారు. అయితే బీఏసీ సమావేశంలో టీడీపీ నేత అచ్చెన్నాయుడుపై సీఎం జగన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. గవర్నర్ ప్రసంగాన్ని అడ్డుకోవడంపై ఆగ్రహించారు. గవర్నర్ మీ పార్టీ కాదు.. మా పార్టీ కాదు.. అంతపెద్ద వ్యక్తిని అవమానించడం సరికాదన్నారు. గతంలో ఎప్పుడూ ఇలా జరగలేదన్నారు.
గవర్నర్ మీ పార్టీ కాదు.. మా పార్టీ కాదు : అచ్చెన్నాయుడుపై జగన్ ఫైర్
Advertisement
తాజా వార్తలు
Advertisement