అమరావతి: తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు ఆరోగ్య పరిస్థితిపై ప్రభుత్వ వైఖరి అమానవీయమని జనసేన అధినేత పవన్ కల్యాణ్ అన్నారు. ‘‘చంద్రబాబు ఆరోగ్య పరిస్థితిపై ఈ ప్రభుత్వ వైఖరి అమానవీయం. ఆయన ఆరోగ్య సమస్యలపై మానవతాదృక్పథంతో వ్యవహరించాలి. ఆరోగ్యం విషయంలో రాజకీయ కక్ష ధోరణి సరికాదు. ప్రభుత్వమే బాధ్యత వహించాలి’’ అని పవన్ వెల్లడించారు. మరోవైపు చంద్రబాబు ఆరోగ్యంపై పూర్తిస్థాయి నివేదిక ఇవ్వాలని జైలు అధికారులను ఆయన కుటుంబసభ్యులు కోరారు.
Advertisement
తాజా వార్తలు
Advertisement