Friday, October 18, 2024

AP | ఈవీల‌కు ప్రభుత్వ ప్రోత్సాహం… పన్ను మినహాయింపు పొడిగింపు !

అమరావతి, ఆంధ్రప్రభ : పర్యావరణాన్ని పరిరక్షించడానికి పెట్రోల్‌, డీజిల్‌తో నడిచే వాహనాలకు గుడ్‌బై చెప్పి.. చాలా మంది ఎలక్ట్రిక్‌ వాహనాలకు మారిపోతున్నారు. గత కొన్ని నెలలుగా ఈ సంఖ్య పెరుగుతోంది. దీంతో ఎలక్ట్రిక్‌ వాహనాల అమ్మకాలను ప్రోత్సహించేలా ప్రభుత్వాలు చర్యలు తీసుకుంటున్నాయి.

ఇప్పటికే ఎలక్ట్రిక్‌ వాహనాలపై పన్ను మినహాయింపు ఉండగా.. ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం.. పన్ను మినహాయింపు గడువును మరో ఆరు నెలలు పాటు పొడిగించింది.. ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది.. 2024 డిసెంబర్‌ 7 తేదీ వరకూ రాష్ట్రంలో ఈవీలపై పన్ను మినహాయిస్తూ ఇస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.

2018-23తో ముగిసిన ఈవీ విధానం స్థానంలో.. కొత్త విధానం అమల్లోకి వచ్చేంత వరకూ పన్ను మినహాయింపు పొడిగింపుపై నిర్ణయం తీసుకుంటామని ఉత్తర్వుల్లో పేర్కొంది ఏపీ ప్రభుత్వం.. ఏపీ మోటారు వాహనాల చట్టం 1963 కింద ఈవీలకు పన్ను మినహాయింపు పొడిగిస్తూ ఆదేశాలు జారీ చేసింది.

కాగా, గతంలో పోలిస్తే.. ఇప్పుడు ఈవీలకు మారేవారి సంఖ్య పెరుగుతూ వస్తుంది.. ఈవీ బైక్‌లతో పాటు-.. కార్లకు కూడా డిమాండ్‌ పెరుగుతోంది.. ఖర్చు కూడా భారీగా కలిసివస్తుండడంతో.. వినియోగదారులు ఈవీలవైపు మొగ్గుచూపుతోన్న విషయం విదితమే.

Advertisement

తాజా వార్తలు

Advertisement